05/11/2026, Thursday · 08:34:47 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

రాప్తాడు పాఠశాల విద్యార్థినిపై దాడి కేసు.. నిందితుడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు..?

భవ్య జర్నలిస్ట్ 01/11/2026 9:10 PM అనంతపురము 27

రాప్తాడు పాఠశాల విద్యార్థినిపై దాడి కేసు.. నిందితుడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు..?
Want this news as a newspaper clip?Print News Clip
  • అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. యువతిపై దాడి అనంతరం తప్పించుకుని తిరుగుతున్న యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతడిపై కాల్పులు జరిపినట్లు సమాచారం.

 రాప్తాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై చెట్లు నరికే రంపం యంత్రంతో హేమంత్ దాడి చేశాడు. బాలిక తీవ్రంగా గాయపడటంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అప్పటి నుంచి ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.అయితే, ఆత్మకూరు అడవుల్లో నిందితుడు ఉన్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి అతను తారసపడగా.. తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. పోలీసుల కాల్పుల్లో యువకుడికి గాయాలైనట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Police firingRaptuschoolstudentassaultcaseaccusedHemant

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News