05/11/2026, Thursday · 08:34:49 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

రాయచోటి మున్సిపాలిటీలో కూటమి చారిత్రాత్మక విజయం.. 44కు 44 స్థానాలు ఏకగ్రీవం

భవ్య జర్నలిస్ట్ 25/10/2026 8:25 PM అన్నమయ్య 8

రాయచోటి మున్సిపాలిటీలో కూటమి చారిత్రాత్మక విజయం.. 44కు 44 స్థానాలు ఏకగ్రీవం
Want this news as a newspaper clip?Print News Clip
  • మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బోనుమాల ఖాదర్ వలీ ఏకగ్రీవ ఎన్నిక
  • ఏకగ్రీవంగా ఎన్నికైన కౌన్సిలర్లకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు

రాయచోటి మున్సిపాలిటీలో కూటమి సాధించిన చారిత్రాత్మక విజయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాయచోటి మున్సిపాలిటీలో మొత్తం 44 వార్డులకు గాను 44 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన బోనుమాల ఖాదర్ వలీతో పాటు, ఏకగ్రీవంగా ఎన్నికైన 44 మంది కౌన్సిలర్లకు మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యత, ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు, స్థానికంగా చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ల ప్రజల్లో నెలకొన్న విశ్వాసానికి ఈ విజయం నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. రాయచోటి నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి కూటమికి మరింత బలాన్ని చేకూర్చాయని పేర్కొన్నారు.
ఈ చారిత్రాత్మక విజయం కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల సమిష్టి కృషికి ప్రతిఫలమని మంత్రి అభివర్ణించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా స్వీకరించి, రాయచోటి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ఏకగ్రీవంగా ఎన్నికైన కౌన్సిలర్లకు సూచించారు. పట్టణంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.
రాయచోటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన, ప్రజలకు జవాబుదారీగా ఉండే పాలన అందించడమే తమ లక్ష్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాయచోటి మున్సిపాలిటీని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కూటమి నాయకత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Historic victorycoalitionRayachotiMunicipalityoutseatsunanimous

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News