05/11/2026, Thursday · 08:33:18 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

“సైకిల్ టైర్‌ను పంచర్ చేయాలి.. ఫ్యాన్‌ను గిరగిరా తిప్పించాలి” – మాజీ మంత్రి Roja Selvamani

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 9:23 PM చిత్తూరు 9

“సైకిల్ టైర్‌ను పంచర్ చేయాలి.. ఫ్యాన్‌ను గిరగిరా తిప్పించాలి” – మాజీ మంత్రి Roja Selvamani
Want this news as a newspaper clip?Print News Clip
  • నగరి రూరల్ మండలంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా రోజా విస్తృత ఎన్నికల ప్రచారం

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నగిరి రూరల్ మండలం వికెఆర్ పురం ఎంపీటీసీ అభ్యర్థి భారతి రాము, రూరల్ మండలం జెడ్పీటీసీ అభ్యర్థి తులసమ్మలకు మద్దతుగా మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీమతి ఆర్కే రోజా గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా వికెఆర్ పురం ఎంపీటీసీ పరిధిలోని మీరా సాహి, పాల్యం పంచాయతీలలో రోజా గారు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలుపై రోజా గారు ప్రశ్నలు సంధిస్తూ ప్రజలకు వివరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన లబ్ధిని గుర్తు చేశారు.
ప్రచారంలో రోజా గారు మాట్లాడుతూ “సైకిల్ టైర్‌ను పంచర్ చేయాలి.. ఫ్యాన్‌ను గిరగిరా తిప్పించాలి.. ఫ్యాన్ గాలి ప్రతి ఇంటిలో ఉండాలి” అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
అలాగే ఎంపీటీసీ అభ్యర్థి భారతి రాము, జెడ్పీటీసీ అభ్యర్థి తులసమ్మలకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

tippimchali majisaikiltairnupamcharcheyaliphyannugiragira

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News