05/11/2026, Thursday · 08:34:45 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

వర్షం తగ్గినా తుఫాన్ ముప్పు తగ్గలేదు.. అత్యంత అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ లక్ష్మీశా

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 10:39 AM ఎన్.టి.ఆర్. 17

వర్షం తగ్గినా తుఫాన్ ముప్పు తగ్గలేదు.. అత్యంత అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ లక్ష్మీశా
Want this news as a newspaper clip?Print News Clip

ఆర్నబ్ తుఫాన్ ముప్పు నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశా ఆదేశాలు జారీ చేశారు. వర్షం తగ్గినా తుఫాన్ ముప్పు తగ్గలేదని, ల్యాండ్‌ఫాల్ సమయంలో తీవ్ర ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను కలెక్టర్ సమీక్షిస్తున్నారు. లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజల రక్షణకు ప్రత్యేక పునరావాస కేంద్రాలు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని ఆదేశించారు. చెట్లు విరిగిపడినా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగినా, రోడ్లు బ్లాక్ అయినా క్షేత్ర బృందాలు తక్షణమే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. క్షేత్రస్థాయి సమాచారాన్ని స్ప్రెడ్‌షీట్‌లో వెంటనే అప్‌లోడ్ చేయని సిబ్బందిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని వారిపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. తుఫాన్ సహాయక చర్యలపై సీఎంవో నిరంతరం సమీక్షిస్తున్నందున అధికారులు క్షణం కూడా విశ్రమించరాదని స్పష్టం చేశారు. విద్యుత్, తాగునీరు, రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముందస్తు ప్రణాళికతో అత్యవసర వైద్య సేవలు, గర్భిణుల సంరక్షణపై ప్రత్యేక పర్యవేక్షణను అధికారులు కొనసాగిస్తున్నారు. తుఫాన్ ప్రభావం ముగిసేవరకు లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలని జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ లక్ష్మీశా విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Collector LakshmishaCyclonethreatreducedrainrecedesextremelyvigilant

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News