05/11/2026, Thursday · 08:34:47 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

విజయవాడ కౌంటింగ్‌లో గందరగోళం.. అర్ధరాత్రి వరకు సాగే అవకాశం

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 12:43 PM ఎన్.టి.ఆర్. 8

విజయవాడ కౌంటింగ్‌లో గందరగోళం.. అర్ధరాత్రి వరకు సాగే అవకాశం
Want this news as a newspaper clip?Print News Clip

విజయవాడ : విజయవాడ నగరపాలక సంస్థకు జరిగే ఎన్నికల కౌంటింగ్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. భారీ వర్షం కారణంగా నీరు చేరడంతో రెండున్నర గంటలు ఆలస్యంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే కనీస సమాచారం చెప్పే వారు కూడా లేరంటూ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కౌంటింగ్ ఏర్పాట్లపై ఇండిపెండెంట్ అభ్యర్థి ఏబీ వెంకటేశ్వర రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.కౌంటింగ్ హాల్స్‌లో ఏజెంట్లు నిలబడేందుకు కూడా సరైన వసతి లేదని ఏజెంట్లు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో లయోలా కాలేజ్ పూర్తిగా జలమయమైంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కూడా ఇంకా పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. ఇంకా సగానికి పైగా పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ సరళిని చూస్తే అర్ధరాత్రి అవుతుందని అభ్యర్థులు చెబుతున్నారు. మీడియాకు సమాచారం ఇచ్చే వారు కూడా లేకపోవడంతో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.

అటు.. కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా ప్రతినిధులు కూడా నానా కష్టాలు పడుతున్నారు. ముందుగా వీఎంసీ అధికారులు ఏర్పాటు చేసిన మీడియా పాయింట్‌లోకి మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో అక్కడి నుంచి ఓపెన్ ఆడిటోరియం వద్దకు మీడియాను తరలించారు. ఇంతలోనే కమిషనర్ మాట్లాడుతారు మీడియా కౌంటింగ్ కేంద్రం వద్దకు రావాల్సిందిగా పిలుపు రావడంతో మరోసారి వర్షంలో మీడియా సిబ్బంది తిప్పలు పడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తమ ఇబ్బందులు చెప్పి ఆడిటోరియం మీడియా పాయింట్‌కు రావాల్సిందిగా కమిషనర్‌కు మీడియా సిబ్బంది విజ్ఞప్తి చేశారు. అయితే ఇంత జరుగుతున్నా కూడా మీడియా ఇబ్బందులను వీఎంసీ సమాచార విభాగం, పీఆర్ఓలు పట్టించుకోకపోవడం చర్చకు దారి తీసింది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

sage avakashamvijayavadakaumtimglogamdaragolamardharatrivaraku

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News