05/11/2026, Thursday · 08:34:46 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రకాశ్ నగర్‌లో పోలీసుల ప్లాగ్ మార్చ్

భవ్య జర్నలిస్ట్ 24/10/2026 10:33 PM గుంటూరు 7

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రకాశ్ నగర్‌లో పోలీసుల ప్లాగ్ మార్చ్
Want this news as a newspaper clip?Print News Clip
  • శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు.
  • ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడమే లక్ష్యం.
  • ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు పోలీసు చర్యలు.

గుంటూరు జిల్లా పరిధిలో రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ టి. సీతారామం గారి పర్యవేక్షణలో 24.10.2026న రాత్రి 7 గంటలకు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాశ్ నగర్‌లో పోలీసుల ప్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ ప్లాగ్ మార్చ్ ద్వారా ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిని ముందుగానే హెచ్చరించడంతో పాటు, ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించడం, భద్రతా భావాన్ని కల్పించడం ప్రధాన ఉద్దేశ్యంగా పెట్టుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ చర్యలు చేపడుతోంది.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించినా, శాంతిభద్రతలకు భంగం కలిగించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నికల నియమావళిని పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు.
ఈ ప్లాగ్ మార్చ్‌లో కొత్త పేట సీఐ వీరయ్య మరియు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రకాశ్ నగర్‌లో పోలీసుల ప్లాగ్ మార్చ్

Plug MarchPolicePrakashNagarContextMunicipalCorporationElection

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News