05/11/2026, Thursday · 09:02:45 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కులమతాలకు అతీతంగా కలిపే వేదిక.. అలాయ్ బలాయ్: బండారు దత్తాత్రే

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 12:57 PM హైదరాబాద్ 8

కులమతాలకు అతీతంగా కలిపే వేదిక.. అలాయ్ బలాయ్: బండారు దత్తాత్రే
Want this news as a newspaper clip?Print News Clip

కులమతాలు, రాజకీయాలు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే కార్యక్రమమే అలాయ్ బలాయ్ అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తుల మధ్య ఎన్ని భిన్నాభిప్రాయాలు, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి ఆత్మీయంగా కలుసుకోవాలని, ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకోవాలని పిలుపునిచ్చారు.స్నేహభావం, ఐక్యతను పెంపొందించడమే అలాయ్ బలాయ్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, ఈ పండుగ స్ఫూర్తితో సమాజంలో సోదరభావం, సామరస్యం మరింత బలపడాలని ఆకాంక్షించారు. వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయ విభేదాలు ఏవైనా.. పండుగల వేళ అందరూ కలిసి ఆనందాన్ని పంచుకోవాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందిస్తుందని వివరించారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Allai BalaiBandaruDattatreyaplatformtranscendencesons

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News