05/11/2026, Thursday · 08:58:23 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

పనులు చేయకపోయినా బిల్లులు!

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 11:08 AM హైదరాబాద్ 14

పనులు చేయకపోయినా బిల్లులు!
Want this news as a newspaper clip?Print News Clip
  • అక్రమాల పుట్టగా వాటర్‌బోర్డు ఫైనాన్స్‌ విభాగం
  • విచారణ చేపట్టిన బోర్డు ఉన్నతాధికారులు
  • త్వరలోనే శాఖాపరమైన చర్యలు చేపట్టే అవకాశం
  • బోర్డు ప్రధాన కార్యాలయంలో పతుల పెత్తనం

హైదరాబాద్‌ సిటీ: వాటర్‌బోర్డులో వివిధ పనులు చేసిన కొందరు కాంట్రాక్టర్లు బిల్లులు పొందడానికి ఇబ్బందులు పడుతుండగా మరికొందరికైతే పనులు చేయకపోయినా బిల్లులిస్తున్నారు. వాటర్‌బోర్డు ఫైనాన్స్‌ విభాగంలోని కొందరు అధికారులే పనులు చేయని సంస్థలకు దగ్గరుండి బిల్లులు చెల్లిస్తున్నారు. ఇందుకు నజరానాలు పొందుతున్నారు. అంతేకాదు.. చెల్లించాల్సిన బిల్లు కంటే అదనపు చెల్లింపులు సైతం చేస్తున్నారు. వాటర్‌బోర్డు ఫైనాన్స్‌ విభాగం అక్రమాల పుట్టగా మారిందనే ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఇప్పటికే విచారణ చేపట్టారు. త్వరలోనే శాఖాపరమైన చర్యలు చేపట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

doing thingsBills

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News