కులగణనపై అసెంబ్లీ సమావేశం నిర్వహించండి

హైదరాబాద్ : జనగణనలో ఓబీసీ కులగణన కాలమ్ చేర్చాలని కోరుతూ ప్రత్యేకంగా శాసన సభ, శాసన మండలి సమావేశాలు చేపట్టి తీర్మానం చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆదివారం ఆమె బహిరంగ లేఖ రాశారు. జన గణనలో ఆదివాసీల మతాన్ని నమోదు చేసేందుకు కూడా ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలంటూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.డిసెంబర్ నుంచి ఇంటింటి జనగణన ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీలకు జనాభా దామాషా మేరకు ఫలాలు అందడం లేదని కవిత పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఓబీసీలు ఎంతమంది ఉన్నారనే దానిపై చట్టబద్ధమైన లెక్కలు లేకపోవడంతోనే.. ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలిపారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












