‘సుచిత్ర’ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

సుచిత్ర జంక్షన్ అంటే ఇప్పుడు హైదరాబాద్‌లోనే కాదు ఇతర ప్రాంతాల్లోనూ తెలియని వారుండరు. కూకట్‌పల్లి, బోయిన్‌పల్లి, కొంపల్లి, మేడ్చల్, బాలానగర్, జీడిమెట్ల వైపు వెళ్లే వారికి సుచిత్ర ఒక కూడలిగా మారిపోయింది. కానీ ఇప్పుడు కనిపిస్తున్న ఈ భారీ అభివృద్ధి వెనకాల ఓ పరిశ్రమ పేరు దాగి ఉంది. ఒక కంపెనీ పేరు ఏకంగా ఓ ప్రాంతానికే శాశ్వత చిరునామాగా ఎలా మారిందో ఈ కథ తెలుసుకోవాలంటే.. ఇప్పుడు సుచిత్రను మరో కోణంలో చూడాల్సిందే. 1981లో సుచిత్ర ఎలకా్ట్రనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాంపొనెంట్ తయారీ సంస్థ ఆవిర్భవించింది. అప్పట్లో ఈ ప్రాంతం ఇప్పటిలా జనంతో కితకితలాడేది కాదు. చుట్టుపక్కల పెద్దగా వాణిజ్య సంస్థలుండేవి కావు. రవాణా సౌకర్యాలు కూడా పరిమితంగానే ఉండేవి.అలాంటి సమయంలో ఇక్కడ ఒక పెద్ద పరిశ్రమ ఏర్పాటు కావడం ఈ ప్రాంతానికే ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. అప్పట్లో ఈ కంపెనీలో 1500కు పైగా ఉద్యోగులు పని చేసేవారు. ఉద్యోగుల రాకపోకలు పెరగడంతో ఈ ప్రాంతం గురించి నగరంతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా తెలిసిందే. ఎవరైనా ఈ ప్రాంతానికి రావాలంటే సుచిత్ర కంపెనీ దగ్గర అని చెప్పడం మొదలుపెట్టారు. క్రమంగా ఈ ప్రాంతానికి గుర్తింపుగా మారిపోయింది. ఇలా సుచిత్ర కంపెనీ పేరు ప్రజల నిత్య జీవితంలో భాగమైంది. ఆటోలు, రోడ్డుమార్గంలో సుచిత్ర పేరు వినిపి స్తుంది. కంపెనీల వద్దనున్న ప్రాంతాన్ని సుచిత్రగా పిలువడం మొదలైంది. సుచిత్ర సెంటర్, సుచిత్ర జంక్షన్ పేర్లతో వెలబడ్డాయి. ఒక సంస్థ చుట్టు ఏర్పడిన ఈ గుర్తింపు చివరకు ఆ సంస్థకంటే కూడా పాపులర్‌గా మా రింది. 2000లో కంపెనీ కార్యకలాపాలు ముగిసినా.. సుచిత్ర పేరు మార లేదు. అదే పేరుతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రస్తుతం అదే ప్రాంగణంలో సుచిత్ర అకాడమీ ఏర్పడడంతో ఆ ప్రదేశానికి విద్యా రంగంలోనూ మరో గుర్తింపు వచ్చింది.ఒకప్పుడు పరిశ్రమ చుట్టు ఉన్న ప్రాంతంగా కన్పించని సుచిత్ర ఇప్పుడు పూర్తిగా రూపాంతరం చెందింది. హైదరాబాద్ విస్తరిస్తున్న కొద్ది నగరానికి ఉత్తరాన వేగంగా అభివృద్ధి చెం దుతూ రియల్ ఎస్టేట్ పుంజుకోవడంతో ఆ ప్రాంతంలో కొత్త నివాస ప్రాం తాలు మెరుగైన రహదారులు రావడంతో సుచిత్ర చుట్టుపక్కల భూముల విలువ పెరిగింది. పరిసర ప్రాంతాల కాలనీలు కూడా అభివృద్ధి చెందాయి. దీంతో సుచిత్ర కేవలం కూడలిగా కాకుండా వేలాది కుటుంబాలకు నివాస ప్రాంతంగా మారింది. సుచిత్ర అభివృద్ధిలో మరో కీలకమార్పు వాణిజ్య రంగం వచ్చింది.ఒకప్పుడు చుట్టుపక్కల పెద్దగా దుకాణాలు కన్పించని ఈ ప్రాంతంలో ఇప్పుడు భారీ షాపింగ్‌మాల్స్, బ్రాండెడ్ షోరూంలు, సూపర్‌మార్కెట్లు, రెస్టారెంట్లు వరుసగా ఏర్పడ్డాయి. ఇతర ప్రాంతాల నుంచి సుచిత్రకు షాపింగ్ కోసం వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఇటీవల విస్తరించిన నగరంలో కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సుచిత్ర పేరుతో ఒక డివిజన్‌గా కూడా ఏర్పడింది. కానీ కుత్బుల్లాపూర్ గ్రామం పేరు కావాలని స్థానికులు కోరడంతో సుచిత్ర పేరు తొలగించి కుత్బుల్లాపూర్ డివిజన్‌గా మార్చారు. ఇదిలా ఉండగా ఇటీవలే రైల్వే అభివృద్ధిలో భాగంగా సుచిత్ర రైల్వేస్టేషన్‌గా కూడా రూపాంతరం చెందడం ఇక్కడి అభివృద్ధికి నిదర్శనంగా మారింది.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే













