05/11/2026, Thursday · 09:02:44 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

చిలుకూరు అడవుల్లో ఆది మానవుల ఆనవాళ్లు

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 12:07 PM హైదరాబాద్ 6

చిలుకూరు అడవుల్లో ఆది మానవుల ఆనవాళ్లు
Want this news as a newspaper clip?Print News Clip

 రాజధాని హైదరాబాద్‌కు సమీపంలోని చిలుకూరు మృగవాణి జాతీయ పార్కు వేల సంవత్సరాల నాటి ప్రాచీన నాగరికతకు ప్రతిరూపంగా నిలుస్తోంది. ఇక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో చరిత్ర పూర్వ కాలానికి చెందిన అరుదైన ఆనవాళ్లు వెలుగు చూశాయి. నాటి మానవులు వాడిన రాతి ఆయుధాలను సానబెట్టిన గాడులు, శిలలపై గీసిన కాషాయ వర్ణ రాతి చిత్రాలు ఇక్కడ బయటపడటంతో ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యం వెలుగులోకి వచ్చింది. పార్కులోని బండ జువ్వి వాచ్‌ టవర్‌ సమీపంలో రాతి బండలపై నాలుగు లోతైన గాడులను గుర్తించారు.ఒక్కొక్కటీ అడుగు పొడవు, 2 నుంచి 4 అంగుళాల లోతు ఉన్న ఈ గాడులను వేట కోసం ఉపయోగించే రాతి పనిముట్లు, ఆయుధాలను పదును పెట్టుకోవడానికి వాడి ఉంటారని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని భౌగోళిక నిర్మాణాలు, సహజ సిద్ధమైన లోయలు, నీటి వనరులు నాటి మానవుల స్థిర నివాసానికి దోహదపడి ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. వాచ్‌ టవర్‌ నుంచి కిలోమీటరు దూరంలోని ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్కు వద్ద ఉన్న ‘పాము పడగ’ ఆకారపు అరుదైన శిలపై విలక్షణమైన రాతి చిత్రాలు ఉన్నాయి. ఈ వర్ణచిత్రాల్లో తాబేలు, ఉత్కంఠ భరితమైన వేట దృశ్యాలు, బాణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.రంగారెడ్డి జిల్లా అటవీశాఖ పరిపాలనాధికారి ఆనంద్‌కుమార్‌ ఈ ప్రాంత భౌగోళిక వివరాలను అందించారు. ‘‘హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వేల ఏళ్ల క్రితమే మానవ సంచారంతోపాటు క్రమబద్ధమైన సమాజ జీవనం ఉందనడానికి ఇవే బలమైన ఆధారాలు. బండ జువ్వి వద్ద నేను స్వయంగా పరిశీలించిన గాడులు, పాము పడగ శిలపై ఉన్న కాషాయ వర్ణ చిత్రాల కాలాన్ని, ప్రాముఖ్యతను శాస్ర్తీయంగా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. సమగ్ర సర్వే చేపడితే హైదరాబాద్‌ చారిత్రక మూలాలు ప్రపంచానికి కొత్త కోణంలో ఆవిష్కృతమవుతాయి’’ అని చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ తెలిపారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

చిలుకూరు అడవుల్లో ఆది మానవుల ఆనవాళ్లు

human tracesEarlyjunglesCHILAKUR

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News