05/11/2026, Thursday · 08:34:47 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

హైదరాబాద్‌లో దారుణం.. సెల్‌ఫోన్ కోసం యువతిని పొడిచి.

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 8:52 PM హైదరాబాద్ 11

హైదరాబాద్‌లో దారుణం.. సెల్‌ఫోన్ కోసం యువతిని పొడిచి.
Want this news as a newspaper clip?Print News Clip

 మలక్‌పేట్‌లో దారుణం చోటు చేసుకుంది. గ్రూప్స్‌ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. యువతి వద్ద నుంచి సెల్ ఫోన్ ఎత్తుకెళ్లాడు. మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్డి అన్నారం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేటకు చెందిన హేమలత (28) మరో ఐదుగురు మహిళలతో కలిసి గడ్డి అన్నారంలో ఒక గదిని అద్దెకు తీసుకొని ఉంటోంది. వీరంతా గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి హేమలత గదిలోకి ప్రవేశించి కూరగాయలు కోసే కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. అనంతరం ఆమె సెల్ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు.ఘటనను గమనించిన పక్క గదిలోని స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. మలక్‌పేట్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న మలక్‌పేట్ పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. చోరీ కోసం వచ్చి కత్తితో దాడి చేశాడా? మరేదైనా కారణముందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

young womanHyderabadstabbedcellphone

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News