మహాపాదయాత్ర సక్సెస్.. టీ బీజేపీ చీఫ్‌ను అభినందించిన అమిత్ షా

హైదరాబాద్ : నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపాదయాత్ర సక్సెస్ అయిందని.. ఇలా పని చేస్తే తెలంగాణలో అధికారంలోకి వస్తామని పార్టీ శ్రేణులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీజేపీ జిల్లా, డివిజన్ అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జిలతో మంత్రి అమిత్ షా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహాపాదయాత్ర సక్సెస్ అయిన నేపథ్యంలో టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావును అభినందించారు. పాదయాత్రలో జన సందోహం చాలా బాగుందని అన్నారు. ప్రజల్లో ఉత్సాహం కనిపిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












