05/11/2026, Thursday · 08:34:49 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖలకు కొత్త అధికారులు

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 12:17 PM హైదరాబాద్ 15

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖలకు కొత్త అధికారులు
Want this news as a newspaper clip?Print News Clip

 తెలంగాణ ప్రభుత్వం పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేపట్టింది. పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. జయేష్ రంజన్‌కు పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ (EFST) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించగా.. వికాస్ రాజ్‌కు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. నవీన్ మిట్టల్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా (RWS) శాఖల బాధ్యతలు అప్పగించింది. శైలజా రామయ్యర్‌కు రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ, ఏ.వాణి ప్రసాద్‌కు క్రీడలు, హెరిటేజ్ తెలంగాణ బాధ్యతలు కేటాయించింది. రాహుల్ బొజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించగా, కె. ఇలంబర్తి‌ను రవాణా శాఖ కార్యదర్శిగా నియమించింది.ఇతర మార్పుల్లో భాగంగా సర్ఫరాజ్ అహ్మద్‌కు జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల అదనపు బాధ్యతలు అప్పగించారు. శృతి ఓజాకు మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల బాధ్యతలు కేటాయించారు. ముషర్రఫ్ అలీ ఫారూఖీకి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించగా, డాక్టర్ సంగీత సత్యనారాయణను మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. జితేష్ వి. పాటిల్‌కు టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఆర్‌ఈడీసీఓ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేరుతో ఉత్తర్వులు విడుదలయ్యాయి.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

IAS transfersMassiveTelanganaofficerskeydepartments

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News