05/11/2026, Thursday · 08:33:18 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి: మంత్రి సీతక్క

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 5:29 PM హైదరాబాద్ 16

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి: మంత్రి సీతక్క
Want this news as a newspaper clip?Print News Clip

హైదరాబాద్ : ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ మంత్రి సీతక్క (Telangana Minister Seethakka) అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి పనులు ప్రారంభించాలని సూచించారు. ఎల్‌నినో‌ను ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన జలసిరి వీడియోను మంత్రి సీతక్క ఈరోజు (బుధవారం) ఆవిష్కరించారు. అలాగే, గవర్నర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రీఅపాయింట్ అయిన దాన కిషోర్‌ను అభినందించి, సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 12,516 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. మిగిలిన 244 గ్రామ పంచాయతీల్లో వెంటనే పనులు ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. అక్టోబరు 27వ తేదీన ఉపాధి పనులకు 3,97,788 మంది కూలీలు హాజరు కావడం రికార్డు అని తెలిపారు. ఇంకా కూలీల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని వివరించారు.

పశువులకు మేత, తాగునీటి కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి..

ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించాలని మంత్రి సీతక్క సూచించారు. నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీచార్జ్ పనులను చేపట్టాలని సూచించారు. పశువులకు మేత, తాగునీటి కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని మార్గనిర్దేశం చేశారు. సర్పంచులు ఎప్పుటికప్పుడు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఎల్‌నినోను ఎదుర్కోవాలని సూచించారు. గ్రామాల్లో ఉపాధి కూలీలను మొబిలైజ్ చేయాలని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పించేందుకు బడ్జెట్ ఉందని వెల్లడించారు. ఆ బడ్జెట్‌ ద్వారా మౌలిక వసతులు, అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని తెలిపారు. అభివృద్ధి పనుల్లో వెనుకబడ్డ సర్పంచులు కార్యదర్శులు మండల అధికారుల మీద చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

కూలీలకు పనులు కల్పించాలి..

గ్రామాల అభివృద్ధి పనులు GPSAPలో నమోదు అవుతున్నాయని మంత్రి సీతక్క వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో కోటి 12 లక్షల రికార్డులను నమోదు చేశామని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించిన సమగ్ర వివరాలు అందులో పొందుపరిచామని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ పీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కూలీలకు పనులు కల్పించాలి, చెక్ డ్యామ్‌లను నిర్మించాలని సూచించారు. అక్కడి భౌగోళిక జీవన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పనులను కల్పించాలని ఆదేశించారు. వలసలను నివారించే లక్ష్యంగా ఉపాధి పనులు కల్పించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ప్రజలకు.. ఎల్‌నినోను సమర్థవంతంగా ఎదుర్కోగలమనే భరోసా కల్పించాలని అన్నారు. ఉక్కు మహిళా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19వ తేదీన గ్రామ మహిళా సంఘ భవనాలను ప్రారంభిస్తామని.. అప్పటిలోగా ఆయా పనులు పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Minister SeethakkaPreventivemeasurestakencounterimpactNiño

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News