05/11/2026, Thursday · 09:02:37 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

పెరుగుతున్న నిత్యావసరాల ధరలు.. ఇబ్బంది పడుతున్న ప్రజలు

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 11:51 AM హైదరాబాద్ 10

పెరుగుతున్న నిత్యావసరాల ధరలు.. ఇబ్బంది పడుతున్న ప్రజలు
Want this news as a newspaper clip?Print News Clip

'ఏమి కొనేటట్టు లేదు.. ఏమి తినేటట్టు లేదు రాజీగో రాజన్న..' అంటూ ఓ కవి సినిమా పాటలో వర్ణించిన విధంగానే మార్కెట్లో కూరగాయాల ధరలు మండిపోతున్నాయి. కూరగాయాల ధరలకు రోజు రోజుకూ రెక్కలొస్తున్నాయి. ఎల్‌నినో ఎఫెక్ట్‌ కారణంగా రోజుల వ్యవధిలోనే 50శాతం వరకు కొన్ని కూరగాయల ధరలు పెరిగాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు కూరగాయలను కొనుగోలు చేయాలంటేనే జేబుకు చిల్లు పడుతోందని ఆలోచిస్తున్నారు. ఏ పప్పు, కూర వండినా ఎక్కువ శాతం ప్రజలు ఇష్టపడే టామాట ధర రోజు రోజుకూ పెరుగుతోంది. ఉల్లిపాయ బీనిస్‌ కాయ, చిక్కుడుకాయ, పచ్చిమిర్చి ధరలు భగ్గుమంటున్నాయి. పాతబస్తీలోని గౌలిపురా, ఛత్రినాక, లాల్‌దర్వా మోడ్‌, ఫలక్‌నుమా బహిరంగ మార్కెట్లలో కూరగాయల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేవు.గత నెలలో టమాటా ధరలు కిలోకు రూ.40 నుంచి రూ.50 వరకు పలుకగా.. ఇప్పుడు సుమారు రూ.60 వరకు పలుకుతోంది. దీంతో సామాన్య ప్రజలు టమాటను కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. బహిరంగ మార్కెట్లతో పోలిస్తే ప్రధాన కూరగాయల మార్కెట్లు, రైతు బజార్‌లలో కూరగాయాల ధరలు పది నుంచి పది హేను శాతం తక్కువగా కనిపిస్తున్నాయి.

ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు

పప్పుల నుంచి అన్ని సరకుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. ఆదాయ వనరులు పెరగకపోవడం.. నిత్యావసరాల ధరలు మండిపోతుండటంతో పేదలు ఒక్కపూటైనా కడుపునిండా తిండి తినలేని పరిస్థితి నెలకొంది. కూరగాయల ధరలు సరేసరి. ఉదయం ఉన్న ధర సాయంత్రానికి మారిపోతోంది. గతంలో కిలోల్లో ధరలు చెప్పేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మార్కెట్‌కు వెళ్లి ధరలను వాకబు చేస్తే పావు కిలో ధరే చెబుతున్నారు. అంటే కిలో ధరలు చూసి సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది.

అన్నదానాలు, క్యాటరింగ్‌పై ఎఫెక్ట్‌

కూరగాయలు ధరలు పెరిగిపోతుండటంతో అన్నదానాలు చేసేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రకాల రకాల కూరగాయలు పెట్టకుండా అన్నదానాలు నిర్వహిస్తున్నారు. శుభ కార్యాలకు ముందే బుకింగ్‌ చేసుకున్న క్యాటరింగ్‌ నిర్వాహకులు కూడా పెరిగిన ధరలు చూసి తమకు అదనంగా డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.

రైతు బజార్లలో ప్రత్యేక విక్రయాలు..

బహిరంగ మార్కెట్లలో టమాట ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారు. రైతు బజార్లలో గ్రామాల నుంచి రైతులు తీసుకొచ్చిన కూరగాయల్ని రైతుబజార్ నిర్వాహకులు తీసుకొని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి.. ఉల్లిపాయ, టమాటా సబ్సిడీలో అందజేయాలని ప్రజలు కోరుతున్నారు.

రైతు బజార్‌లో కూరగాయల ధరలు

ఫలక్‌నుమా రైతు బజార్‌లో కూరగాయల ధరలు గత వారంతో పోలిస్తే ఈ వారం ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని రైతు బజార్‌ సిబ్బంది తెలిపారు. ఆ ధరల వివరాలు(కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

టమోట 27, వంకాయ 23, బెండకాయ 23, పచ్చిమిర్చి 60, కాకరకాయ 23, బీరకాయ 18, క్యాబేజీ 13, బీన్స్‌ 55, క్యారెట్‌ 45, గోకరకాయ 28, చామగడ్డ 40, దోసకాయ 35, దొండకాయ 18, చిక్కుడుకాయ 65, బినీస్‌ కాయ 50, కీర 18, ఉల్లిగడ్డ 40, ఆలుగడ్డ 18, బీట్‌రూట్‌ 33, సొరకాయ 11, పొట్లకాయ 18 వరకు ఉన్నాయి.

ధరలను నియంత్రించాలి

కొన్ని రోజులుగా కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పచ్చిమిర్చి కిలో రూ. 60కు పైగానే పలుకుతోంది. టమాటా చిక్కుడు కాయ, బీనీస్‌ ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. రూ. 200 నుంచి 300 వెచ్చించినా వారానికి సరిపడా కూరగాయలు రావడం లేదు. బియ్యం పప్పుల ధరలు కూడా అమాంతం పెరగడంతో ఏమి తినాలో తెలియని పరిస్థితి నెలకొంది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

commodities PeopleRisingpricesessentialdistress

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News