05/11/2026, Thursday · 08:03:04 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

తెలంగాణలో లక్ష మంది విద్యార్థులకు ఉచిత ఏఐ, క్లౌడ్ శిక్షణ: మంత్రి శ్రీధర్ బాబు

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 4:12 PM హైదరాబాద్ 10

తెలంగాణలో లక్ష మంది విద్యార్థులకు ఉచిత ఏఐ, క్లౌడ్ శిక్షణ: మంత్రి శ్రీధర్ బాబు
Want this news as a newspaper clip?Print News Clip

హైదరాబాద్ : తెలంగాణలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణ అందించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘తెలంగాణ ఏఐ అండ్ క్లౌడ్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్‌’లో భాగంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సహకారంతో టాస్క్ ఆధ్వర్యంలో ఈ శిక్షణను చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి, కళాశాలలకు, విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక భారం లేదని.. రాష్ట్రంలోని 643 టాస్క్ అనుబంధ కళాశాలల్లో శిక్షణ అందిస్తామని వెల్లడించారు.విద్యార్థులకు ఏఐ, డేటా ఇంజినీరింగ్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐలో శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులకూ ప్రత్యేక కోర్సులను అందుబాటులో ఉంటాయన్నారు. తద్వారా ఏడాది పాటు 900కు పైగా డిజిటల్ కోర్సులను విద్యార్థులు ఉచితంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. గ్లోబల్ సర్టిఫికేషన్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు డిస్కౌంట్ వోచర్లు అందిస్తామన్నారు. విద్యార్థులకు హ్యాకథాన్లు, ఇండస్ట్రీ కనెక్ట్ సెషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన అర్హులకు ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహిస్తామన్నారు. కళాశాల అధ్యాపకులకూ ప్రపంచస్థాయి ఏఐ, క్లౌడ్ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. లక్ష మంది యువతకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నైపుణ్యాలను అందించడమే లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

klaud shikshanatelamganalolakshamamdividyarthulakuuchitaeai

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News