05/11/2026, Thursday · 08:02:54 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

60 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా బౌలర్‌..

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 11:07 AM అంతర్జాతీయం 9

60 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా బౌలర్‌..
Want this news as a newspaper clip?Print News Clip

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో భారీ పరాజయం చవిచూసింది. అయితే ఘోర ఓటమిలోనూ ఆసీస్ బౌలర్ స్కాట్ బోలండ్ మాత్రం అరుదైన ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన బోలండ్ 60 ఏళ్ల బ్రేక్ చేశాడు. సాధారణంగా పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే బోలండ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి వన్‌డౌన్‌లో వచ్చి.. 14 బంతుల్లో రెండు పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలోనే ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులకే కుప్పకూలింది.స్వల్ప పరుగులకే కుప్పకూలడంతో ఆస్ట్రేలియా ఫాలోఆన్ లో పడింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగో రోజు ఆట ముగిసిన సమయంలో బోలండ్ ఆరో స్థానంలో వచ్చాడు. ఈసారి 166 బంతుల్లో 40 పరుగులు చేసిన బోలండ్ నైట్‌వాచ్‌మన్(ఆట ముగిసే వరకు ఎక్కువ సేపు స్ట్రైకర్ గా ఉండటం)‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.

గెబెర్హా వేదికగా జరిగిన ఈ టెస్టులో నైట్‌వాచ్‌మన్‌గా అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా బోలండ్‌ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లాండ్ బౌలర్‌ ఇయాన్ థాంప్సన్ పేరిట ఉంది. 1965లో సౌతాఫ్రికాతో టెస్టులో ఇయాన్ థాంప్సన్ నైట్‌వాచ్‌మన్‌గా సాధించాడు. తాజాగా 60 ఏళ్ల తర్వాత స్కాట్ బోలండ్ ఆ రికార్డును బ్రేక్ చేసి.. తన పేరిట లిఖించుకున్నాడు.

ఇక రెండో టెస్టులో ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న దక్షిణాఫ్రికా జట్టు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక రెండో టెస్టులో ఆసీస్‌ను ఇన్నింగ్స్ తేడాతో ఓడించి..ప్రొటీస్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఇక నిర్ణయాత్మక చివరి టెస్టు కేప్‌టౌన్ వేదికగా అక్టోబర్ 27 నుంచి జరగనుంది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

bowler breaksAustralianyearoldrecord

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News