భారత్‌కు రానున్న బంగ్లాదేశ్ ప్రధాని!

బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ వచ్చే నెలాఖరు లేదా డిసెంబర్ మొదట్లో భారత్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో ఇరు దేశాలూ గంగా నదీ జలాల పంపకాల ఒప్పందాన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. ఈ దిశగా జరుగుతున్న చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇస్తేనే తారిఖ్ పర్యటన ఖరారయ్యే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయమై బంగ్లాదేశ్ జలవనరుల శాఖ మంత్రి షాహిదుద్దీన్ మాట్లాడుతూ డిసెంబర్‌లో ఇరు దేశాల మధ్య గంగా జలాల ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అన్నారు. తాము అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే అంశాల్లో ఇదీ ఒకటని చెప్పారుబంగ్లాదేశ్, భారత్ మధ్య దాదాపు 30 ఏళ్ల క్రితం గంగా నదీ జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై అప్పట్లో ప్రధాని దేవె గౌడ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా సంతకాలు చేశారు. జనవరి 1- మే 31 మధ్య వర్షాలు తక్కువగా ఉండే కాలంలో ఫరక్కా బ్యారేజీ ద్వారా గంగా నదీజలాల పంపకాలపై ఈ ఒప్పందం కుదిరింది. భారత పర్యటనకు రావాల్సిందిగా తాము గతంలోనే ఆహ్వానించామని బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషనర్ దినేశ్ త్రివేదీ తెలిపారు. ఈ విషయంలో తొందరపాటు కూడా అవసరం లేదని అన్నారు. ఇదిలా ఉంటే, ప్రధాని తారిక్ అహ్మద్ వచ్చేవారం జపాన్‌లో కూడా పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన మలేషియా, చైనాల్లో పర్యటించారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా కూడా వెళ్లారు. జపాన్ ప్రధాని ఆహ్వానం మేరకు ఆయన అక్కడకు వెళుతున్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












