05/11/2026, Thursday · 08:02:58 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

యూట్యూబ్‌లో కస్టమ్ ఫీడ్స్ ఫీచర్.. ఇక పూర్తి నియంత్రణ మీ చేతుల్లోనే!

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 1:47 PM అంతర్జాతీయం 11

యూట్యూబ్‌లో కస్టమ్ ఫీడ్స్ ఫీచర్.. ఇక పూర్తి నియంత్రణ మీ చేతుల్లోనే!
Want this news as a newspaper clip?Print News Clip

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో ఒకటైన యూట్యూబ్‌కు ఆదరణ ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యూట్యూబ్‌ను వినిగియోస్తుంటారు. ఇక కస్టమర్ల కోసం ఈ ప్లాట్‌ఫామ్ కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. హోమ్‌పేజీ అనుభూతిని పూర్తిగా మార్చేసేలా సరికొత్త అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న పాత టాపిక్ చిప్స్‌ స్థానంలో సరికొత్త 'కస్టమ్ ఫీడ్స్' (Custom Feeds) ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీనితో పాటు మొబైల్ యాప్‌ నావిగేషన్‌లోనూ కొన్ని మార్పులు చేసింది.తాజాగా మార్పులతో ఇకపై యూట్యూబ్ హోమ్‌పేజీలో కేవలం యాప్‌ చూపించే వీడియోలనే కాకుండా, యూజర్లు తమకు నచ్చిన వీడియోలను ప్రత్యేకంగా సెట్ చేసుకోవచ్చు. హోమ్‌పేజీ పైన ఉన్న '+' బటన్‌ను ట్యాప్ చేసి, మీకు నచ్చిన టాపిక్, కంటెంట్ లేదా ప్రత్యేకమైన వీడియోల‌ను టైప్ చేస్తే చాలు. యూట్యూబ్ మ్యూజిక్‌లో ప్లేలిస్ట్ తయారైనట్లే, మీ ప్రాంప్ట్ ఆధారంగా యూట్యూబ్ ఒక ప్రత్యేకమైన వీడియో స్ట్రీమ్‌ను సిద్ధం చేస్తుంది. కొత్త వీడియోలు అప్‌లోడ్ అయినప్పుడు ఈ ఫీడ్స్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి.

ఉచిత వినియోగదారులు ఏకకాలంలో మూడు కస్టమ్ ఫీడ్స్‌ను.. యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లు గరిష్టంగా ఎనిమిది వరకు సేవ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ 'కస్టమ్ ఫీడ్స్' ఫీచర్‌ గురించి ఎక్స్ వేదికగా కీలక విషయాలను వెల్లడించారు. ఈ అప్‌డేట్ యూజర్లకు వారి హోమ్‌పేజీపై పూర్తి నియంత్రణను ఇస్తుందని పేర్కొన్నారు. 'కస్టమ్ ఫీడ్‌లతో, మీ హోమ్‌పేజీకి మేమే పూర్తి నియంత్రణను ఇస్తున్నాము' అని మోహన్ వెల్లడించారు.

మరోవైపు యూట్యూబ్ తన మొబైల్ యాప్ డిజైన్‌లో కూడా స్వల్ప మార్పులు చేస్తోంది. హోమ్ ట్యాబ్‌లోనే సరికొత్త టాప్ బార్‌ను పరీక్షిస్తోంది. ఈ కొత్త నావిగేషన్ బార్‌లో 'సబ్‌స్క్రిప్షన్స్' ఫీడ్‌ను చేర్చారు. దీనితో పాటు లైవ్, మ్యూజిక్ షార్ట్‌కట్స్, సబ్‌స్క్రైబర్ల కోసం 'మూవీస్ అండ్ టీవీ' ఆప్షన్ కూడా ఈ టాప్ బార్‌లోనే కనిపించనున్నాయి. ప్రస్తుతం ఈ అప్‌డేట్ అమెరికాలో 13 ఏళ్లు పైబడి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెట్టింగ్‌లు కలిగి ఉన్న యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. ఈ ఫీచర్ పనిచేయాలంటే వాచ్, సెర్చ్ హిస్టరీ ఆన్‌లో ఉండాలి. మొబైల్ యాప్‌లో క్రియేట్ చేసిన ఫీడ్స్ డెస్క్‌టాప్ బ్రౌజర్‌కూ సింక్ అవుతాయి. త్వరలోనే ఈ అప్‌డేట్‌ను యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

feeds featureCustomYouTubecontrolhands

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News