05/11/2026, Thursday · 08:34:49 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కత్తితో బ్రతికేవాడు కత్తితోనే చస్తాడు.. డెమోక్రాట్లకు ఎలాన్ మస్క్ వార్నింగ్..

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 3:09 PM అంతర్జాతీయం 12

కత్తితో బ్రతికేవాడు కత్తితోనే చస్తాడు.. డెమోక్రాట్లకు ఎలాన్ మస్క్ వార్నింగ్..
Want this news as a newspaper clip?Print News Clip

అమెరికాలోని డెమోక్రాట్ నేతలకు ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ ఘాటు వార్నింగ్ ఇచ్చారు. వచ్చే నెలలో జరిగే మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే.. తన కార్యకలాపాలపై విచారణలు చేపట్టవచ్చన్న వార్తల నేపథ్యంలో మస్క్ ఘాటుగా స్పందించారు. 'కత్తితో బ్రతికేవాడు.. కత్తితోనే చస్తాడు..' అంటూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ అయిన మస్క్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు సన్నిహితుడనే సంగతి తెలిసిందే (Elon Musk warning).అమెరికా రాజకీయాల్లో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్‌లో రిపబ్లికన్ల ఆధిపత్యం ఉంది. అయితే నవంబర్ 3న జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత డెమోక్రాట్లకు ప్రాతినిధ్యం పెరిగే అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ డెమోక్రాట్లు ప్రతినిధుల సభలో ఆధిపత్యం సాధిస్తే.. మస్క్ గతంలో ప్రభుత్వంలో నిర్వహించిన పాత్ర, ఆయన కంపెనీలకు లభించిన ప్రభుత్వ ఒప్పందాలు, ప్రయోజనాల ఆరోపణలపై విచారణలు తప్పవని వార్తలు వస్తున్నాయి (US Midterm Elections 2026).ఈ నేపథ్యంలో తాజాగా మస్క్ స్పందించారు. 'నాతో గొడవలు పెట్టుకునేవారు ఒక విషయం అర్థం చేసుకోవాలి. తెర వెనుక అసలు సూత్రధారులు ఎవరో నేను కనుక్కుంటా. కేవలం కీలుబొమ్మలనే కాకుండా, అసలు సూత్రధారుల పని కూడా పడతా' అని మస్క్ ఓ పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ గతంలో ప్రభుత్వ వ్యయాలను తగ్గించే లక్ష్యంతో ఏర్పాటైన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు (Elon Musk News).

ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, వివిధ విభాగాల ఖర్చులను కుదించడం వంటి చర్యలు చేపట్టారు. అయితే నిధుల వినియోగం, ఉద్యోగాల కోతలు వంటి అంశాలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. డెమోక్రాట్లు అధికారంలోకి వస్తే డోజ్ కార్యకలాపాలు, మస్క్ నిర్వహించిన పాత్రపై కాంగ్రెస్ కమిటీలు విచారణ జరిపే అవకాశముంది. ఆయన కంపెనీలైన టెస్లా, స్పేస్‌ఎక్స్‌కు లభించే ప్రభుత్వ ఒప్పందాలు, ప్రయోజనాల సంఘర్షణ ఆరోపణలు కూడా పరిశీలనకు రావచ్చని వార్తలు వస్తున్నాయి.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

mask varnimgkattitobratikevadukattitonechastadudemokratlakuelan

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News