05/11/2026, Thursday · 08:34:44 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

హర్మూజ్‌ జలసంధిలో నౌకపై దాడి.. సముద్రంలో మునిగిన సింగపూర్‌ షిప్‌

భవ్య జర్నలిస్ట్ 15/10/2026 2:17 PM అంతర్జాతీయం 10

హర్మూజ్‌ జలసంధిలో నౌకపై దాడి.. సముద్రంలో మునిగిన సింగపూర్‌ షిప్‌
Want this news as a newspaper clip?Print News Clip
  • రెండు సింగపూర్‌ రిజిస్ట్రేషన్‌ నౌకలపై దాడులు జరిగినట్లు సమాచారం
  • జీఎఫ్ఎస్‌ ప్రైడ్‌ నౌక దగ్ధమై సముద్రంలో మునక
  • రెండు నౌకల్లోని 43 మంది సిబ్బంది సురక్షితం
  • నౌక మైన్‌ను ఢీకొని మునిగిపోయిందన్న ఇరాన్‌ నేవీ

హర్మూజ్‌ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ మార్గంలో ప్రయాణిస్తున్న సింగపూర్‌ రిజిస్ట్రేషన్‌ కలిగిన రెండు కంటైనర్‌ నౌకలపై దాడులు జరిగినట్లు సింగపూర్‌ మారిటైమ్‌ అండ్‌ పోర్ట్‌ అథారిటీ వెల్లడించింది. ఈ ఘటనలో జీఎఫ్ఎస్‌ ప్రైడ్‌ అనే నౌకలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమై సముద్రంలో మునిగిపోయింది. అయితే, నౌకలోని 21 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు.

మరో నౌక జీఎఫ్ఎస్‌ గిసెల్‌ స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ సురక్షిత ప్రాంతానికి చేరుకుందని, అందులోని 22 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. రెండు నౌకల్లోనూ సింగపూర్‌ పౌరులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నారు. సముద్ర మార్గంలో ప్రయాణించే ఇతర నౌకలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు, ఈ ఘటనపై ఇరాన్‌ భిన్నమైన వాదనను వినిపించింది. తమ జలాల్లోకి అనధికారికంగా ప్రవేశించిన నౌక నేవల్‌ మైన్‌ను ఢీకొని పేలిపోయిందని ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ నేవీ పేర్కొంది. నౌకలో 2,500కు పైగా కంటైనర్లు ఉన్నాయని, సముద్రంలో తేలియాడుతున్న కంటైనర్లతో ఇతర నౌకలకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. హర్మూజ్‌ జలసంధిని తమ నౌకాదళం నిరంతరం పర్యవేక్షిస్తోందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నేవీ కమాండర్‌ అలీ అజ్మాయీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

SingaporeshipsinksStraitHormuz

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News