05/11/2026, Thursday · 08:34:44 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

అవి మూర్ఖపు వ్యాఖ్యలు.. ట్రంప్‌పై ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఆగ్రహం..

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 11:43 AM అంతర్జాతీయం 11

అవి మూర్ఖపు వ్యాఖ్యలు.. ట్రంప్‌పై ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఆగ్రహం..
Want this news as a newspaper clip?Print News Clip

ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న నిరసనలు అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షుల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. దేశంలో హింసాత్మక ఘటనలకు వలసదారులే కారణమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ నేతలు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కానివని, మూర్ఖత్వంతో కూడుకున్నవని విమర్శించారు (Emmanuel Macron fires on Donald Trump).ఫ్రాన్స్‌లో నెలకొన్న పరిస్థితులను ఇతర దేశాల నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని మాక్రాన్ ఆరోపించారు. ఫ్రాన్స్‌లో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్లకు వలస విధానాలే ప్రధాన కారణమని ట్రంప్ ఆరోపించారు. దేశ సరిహద్దులను మూసివేసి పరిస్థితులను అదుపులోకి తీసుకోవాలని మాక్రాన్‌కు సూచించారు. వలసదారులు, ఇస్లామిక్ తీవ్రవాదులు, కమ్యూనిస్టుల కారణంగానే ఫ్రాన్స్‌లో హింస చెలరేగుతోందని ఆయన పేర్కొన్నారు. వలసలను నియంత్రించకపోతే ఐరోపా దేశాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న పరిణామాలను అమెరికన్లు కూడా గమనించాలని వ్యాఖ్యానించారు (France Protests 2026).

ఖతార్ పర్యటనలో భాగంగా దోహాలో మీడియాతో మాట్లాడిన మాక్రాన్.. ఫ్రాన్స్‌లోని పరిస్థితులపై విదేశీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబట్టారు (Macron Trump Clash). 'ఫ్రాన్స్‌లో అల్లర్ల తర్వాత తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. దాని ఆధారంగా పలువురు నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న కొందరు విదేశీ నాయకులు మా దేశంలోని పరిస్థితులను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఫ్రాన్స్ ఎదుర్కొంటున్న సమస్యలను మరింత తీవ్రతరం చేసేలా తప్పుడు ప్రచారం చేయవద్దు' అని సూచించారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Emmanuel MacronsillycommentsFrenchPresidentangryTrump

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News