కాకినాడ సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక

కాకినాడలోనూ ఆర్నబ్ తుఫాను బీభత్సం సృష్టించింది. ఇక్కడి సముద్రంలో కార్గో నౌక కొట్టుకుపోయింది. విశాఖ నుంచి సింగపూర్ బయలుదేరిన నౌక.. ఇంజిన్ ఫెయిల్ కావడంతో కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. కేజీ బేసిన్‌లోని రవ్వ ఆయిల్ క్షేత్రం వద్ద నౌక కొట్టుకుపోయిందని వెల్లడించారు. దానిని మార్షల్ ఐలాండ్‌కు చెందిన సిగ్మా పేరల్ నౌకగా గుర్తించామని చెప్పారు. నౌక 130 నాటికల్ మైళ్లు కొట్టుకుపోయిందని తెలిపారు. అంతకుముందు ఆ షిప్ విశాఖలో సరుకును అన్లోడ్ చేసిందని, తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని వివరించారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












