05/11/2026, Thursday · 08:33:16 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కాకినాడకు ‘అర్నబ్’ తుఫాన్‌ ముప్పు.. రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవులు

భవ్య జర్నలిస్ట్ 26/10/2026 12:42 PM కాకినాడ 6

కాకినాడకు ‘అర్నబ్’ తుఫాన్‌ ముప్పు.. రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవులు
Want this news as a newspaper clip?Print News Clip

 ఏపీకి ‘అర్నబ్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. రేపు రాత్రికి అతి తీవ్ర తుఫాన్‌గా మారి.. ఎల్లుండి బాపట్ల - విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.హరిందర ప్రసాద్ మాట్లాడుతూ.. అర్నబ్ తుఫాన్ కాకినాడను తాకే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని.. దీనిపై ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. 6 తుఫాన్ కేంద్రాలు ఉన్నాయని.. రేపు ఉదయానికి సైక్లోన్ సెల్టర్స్‌కు తీర ప్రాంత ప్రజలను తరలించనున్నట్లు చెప్పారు. మత్స్యకారులను కూడా అప్రమత్తం చేశామన్నారు.మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని చెప్పామని.. వాళ్లు కూడా సహకరిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. దానిపై కూడా ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశామన్నారు. జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని.. 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని తెలిపారు. కంట్రోల్ రూం నంబర్లు 08842356801, 9849903879కు సంప్రదించవచ్చన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసరమైన ప్రయాణాలు చేయవద్దని, అత్యవసరమైన నీరు, ఆహారం, టార్చ్‌లైట్‌లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. తుఫాన్ నేపథ్యంలో రేపు, ఎల్లుండి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ ఎం.హరిందర ప్రసాద్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Arnab threatCycloneKakinadaEllundieducationalinstitutionsremainclosed

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News