05/11/2026, Thursday · 08:33:16 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

మాట తప్పితే అర ఎకరం వదులుకుంటా

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 12:35 PM కాకినాడ 15

మాట తప్పితే అర ఎకరం వదులుకుంటా
Want this news as a newspaper clip?Print News Clip
  • మాట తప్పితే అర ఎకరం వదులుకుంటా
  • సర్పంచ్ అభ్యర్థి పాటి నాగ సత్యనారాయణ వినూత్న నిర్ణయం
  • 18 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని గ్రామాన్ని మార్చాలన్న లక్ష్యం
  • హామీ నెరవేర్చకపోతే అర ఎకరం భూమి పంచాయతీకి!

సర్పంచ్ అభ్యర్థి పాటి నాగ సత్యనారాయణ వినూత్న నిర్ణయం

హామీ నెరవేర్చకపోతే అర ఎకరం భూమి పంచాయతీకి!

18 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని గ్రామాన్ని మార్చాలన్న లక్ష్యం

శ్రీరాంపురం, గ్లోబల్ వార్త: ఎన్నికల్లో హామీలు ఇవ్వడమే కాదు.. వాటిని నెరవేర్చకపోతే తన సొంత భూమిని పంచాయతీకి అప్పగిస్తానంటూ ఓ సర్పంచ్ అభ్యర్థి ముందుకొచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని యు.కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన యువ నాయకుడు పాటి నాగ సత్యనారాయణ తన ధర్మపత్ని సత్యవేణిని సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలుపుతూ ఈ వినూత్న హామీ ప్రకటించారు. గ్రామంలో గత 18 ఏళ్లుగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్‌) పరిణామాల నేపథ్యంలో గ్రామం అభివృద్ధికి దూరమైందని ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

గ్రామంలో సోలార్‌ ప్లాంట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి, రెండు ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, రహదారుల అభివృద్ధి, సోలార్‌ వీధి దీపాల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ హామీలను తప్పనిసరిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో తనకు చెందిన అర ఎకరం భూమిని పంచాయతీ స్వాధీనం చేసుకునేలా వీలునామా రాస్తానని ప్రకటించారు.

ఎన్నికల్లో ఇచ్చే హామీలకు బాధ్యత వహించాలనే ఉద్దేశంతోనే తన సొంత ఆస్తిని పణంగా పెట్టేందుకు సిద్ధమయ్యానని నాగ సత్యనారాయణ పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకొస్తున్న యువ నాయకత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

wrong thinghalfacrewere

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News