05/11/2026, Thursday · 08:33:03 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

మాజీ మంత్రి యనమలకు స్వల్ప అస్వస్థత

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 4:27 PM కాకినాడ 9

మాజీ మంత్రి యనమలకు స్వల్ప అస్వస్థత
Want this news as a newspaper clip?Print News Clip

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (TDP Leader Yanamala Ramakrishnudu ) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాకినాడలోని ట్రస్ట్ ఆస్పత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయనకు గుండె శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యనమలకు అమర్చిన స్టంట్లో స్వల్ప ఇబ్బందులు రావడంతో అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆ తర్వాత తిరిగి వైద్యం అందించడంతో యనమల ఆరోగ్యం కుదుటపడింది. ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు ఆయనను తరలించారు. యనమలకు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.

యనమల ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా..

యనమల ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. యనమల ఆరోగ్య పరిస్థితి గురించి తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సీఎం.. తెలుగుదేశం పార్టీ నేతలను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎంపీ సానా సతీశ్ ట్రస్ట్ ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. యనమల ఆరోగ్య పరిస్థితి గురించి సీఎంకు సమాచారం అందజేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

minister YanamalaMildillnessformer

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News