05/11/2026, Thursday · 08:34:38 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ముందుంది కష్టకాలమే...నీటి పొదుపుతోనే భవిష్యత్తు

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 11:39 AM కరీంనగర్ 12

ముందుంది కష్టకాలమే...నీటి పొదుపుతోనే భవిష్యత్తు
Want this news as a newspaper clip?Print News Clip
  • పట్టణాలు, పల్లెల్లో వృథా తగ్గాలి
  • జలం ఒడిసిపడితే జనాలకు మేలు
  • పట్టణాల్లో అధికంగా..

తాగునీటి కోసం రాష్ర్టాల మధ్య వివాదాలు చూస్తున్నాం. స్వచ్ఛమైన తాగు నీటిని లీటర్లలో కొనుగోలు చేస్తున్నాం. గుక్కెడు నీళ్ల కోసం పల్లెలు, తండాల్లో జనాలు తల్లడిల్లిన పరిస్థితుల్ని గతంలో చూశాం. ప్రస్తుతం ఎల్‌నినో ముప్పుతో నీటికి కటకట తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో తాగునీటి కోసం పలుచోట్ల నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రాబోవు వేసవి కాలమైన మే నెలలో మన పరిస్థితి ఏంటనేది అంతుచిక్కడం లేదు. మండు టెండల్లో నీటి ఇబ్బంది రాకూడదంటే ఇప్పటినుంచే నీటి పొదుపును పాటించాలి. వ్యక్తిగతంగా ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవ డంతోపాటు వ్యవస్థాగతంగానూ నీటిని ఒడిసి పట్టేం దుకు ప్రయత్నించాలి. చుక్క బొట్టు నీరు కూడా వృథా కాకుండా ఆచరణలో మన బాధ్యతను చూపించాలి. మన జీవనాదారమైన జలాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి.

కరీంనగర్‌, రామగుండం కార్పొరేషన్‌లతోపాటు మున్సిపాలిటీల్లో నీటి వృథాను అరికట్టాల్సిన అవసరముంది. ఇప్పుడే ప్రతీ ఒక్కరికి పట్టణ పారంతాల్లో 135 లీటర్లు అవసరం ఉండగా ఇందులో సగానికి పైగానే తాగునీరుని బల్దియా అందిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో గడిచిన రెండు నెలలుగా భూ గర్భజలాలు 2.38 మీటర్ల లోతుకు పడి పోయాయి. దీంతో నల్లాలతో అందే నీళ్లతోపాటు ఇళ్లలోని బోరు నీటిని ఇష్టానుసా రంగా వృథా చేస్తున్న వారిపై మున్సిపా లిటీ అధికారులు దృష్టి సారించాలి.

నీటిని పొదుపు చేయాలని సూ చనలివ్వాలి. పట్టణ ప్రాంతాల్లో 2,32,601 కుటుంబాలు ఉంటే దాదాపు 68శాతం ని వాస గృహాలకు నల్లా కనెక్షన్లున్నాయి. ఒక్క కుటుంబం రోజులో 100 లీటర్లు వృథా చే సినా.. దాదాపు 15 లక్షల లీటర్లు మురికి కా లువల్లోకి చేరుతాయి. సరఫరా అయ్యే నీటి లో సుమారు 1.5 ఎంఎల్‌డీ నీళ్లు నిరుపయోగంగా మారుతాయి. అందుకే పొదుపుగా వాడితే ఈ ఎల్‌ని నో ముప్పును గట్టెక్కే అవకాశముంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ 10.25 లక్షలకుపైగా ఇళ్లున్నాయి. ఊళ్ల ల్లోనూ నీటి పొదుపును వాడితే రో జులో మరో రెండు ఎం ఎల్‌డీల నీళ్లు ఆదా అవు తాయి.మిషన్‌ భగీరథ పైప్‌లైన్ల ద్వారా వృథా అయ్యే నీటి విషయంలో యంత్రాంగం తగిన దష్టిని సారిం చాలి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,247 ఆవాసాలకు శుద్ధిచేసిన జలాలను అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలో చాలా లోపాలు సవరించాల్సి ఉంది. గ్రిడ్‌ల నుంచి నీటిని తరలించేందుకు 2,948 కిలోమీట్ల పొడవునా ప్రధాన పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ను నిర్మించారు. వీటితో ఇబ్బంది లేదు. గ్రామాల్లో, పట్ట ణాల్లో వీధుల్లో ఇంటింటికి నీటిని సరఫరా చేసేందుకు 6,292 కిలోమీటర్ల మేర వేసిన పైప్‌లలో చాలాచోట్ల లీకేజీలు నిత్యం స్థానిక సంస్థల సిబ్బందికి సవాలును విసురుతున్నాయి. చాలా చోట్ల నల్లాలు అమర్చక పోవడంతో సరఫరా సమయంలో నీళ్లు వృథాగా మురికి కాలువల్లోకి పారుతున్నాయి. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్తగా నిర్మించిన 1351 ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లు, సంప్‌హౌస్‌ల వద్ద లీకేజీలు లేకుండా దృష్టిని సారించాలి.

అరికట్టొచ్చిలా..

.ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లు నిండిన తర్వాత ఓవర్‌ఫ్లోను అరికట్టాలి.

.ఊళ్లల్లో మినీట్యాంక్‌ల చెంతన నల్లాలను వాడనప్పుడు కట్టేయాలి.

.గేట్‌వాల్వ్‌లను ఎప్పటికప్పుడు సరిచూడాలి. లీకేజీలను గమనించాలి.

మిషన్‌ భగీరథ ఇళ్ల చెంతన బ్లూపైప్‌లను అన్నిచోట్ల నల్లాలు బిగించాలి.

.మున్సిపాలిటీల్లో నీటి ట్యాంకర్ల లీకేజీలు లేకుండా చూస్తూ ఆదా చేయాలి.

.పబ్లిక్‌ నల్లాల చెంతన కచ్చితంగా ఆన్‌ ఆఫ్‌ విధానాలను అమరిస్తే మేలు.

.గ్రామాల్లో ట్యాంక్‌ నీళ్లు వృథాగా మురికి కాల్వలకు, పొలాలకు వెళ్లడాన్ని ఆపాలి.

.పదే పదే పైపులు పగులుతున్న చోట కొత్తవి ముందుగానే ఏర్పాటు చేయాలి.

నీటి అవసరం గుర్తిస్తేనే..

.ఇంట్లో నీటి పొదుపుపై ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి.

.బైక్‌, వాహనాలను పదే పదే నీళ్లతో కడగడం తగ్గించాలి.

.ఇంటా బయట వృథావెళ్లే నీళ్లను ఇంకుడు గుంతల్లోకి మళ్లించాలి.

.ఇంటి ఆవరణలోని మొక్కలకు పొదుపుగా నీటిని పోయాలి.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

hard timesforefrontfuturewaterconservation

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News