05/11/2026, Thursday · 08:33:17 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

తుఫాన్‌పై వెనిగండ్ల రాము సమీక్ష.. స్వయంగా కారు నడుపుతూ గుడివాడలో పర్యటన

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 10:50 AM కృష్ణా 14

తుఫాన్‌పై వెనిగండ్ల రాము సమీక్ష.. స్వయంగా కారు నడుపుతూ గుడివాడలో పర్యటన
Want this news as a newspaper clip?Print News Clip

తుఫాన్ నేపథ్యంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అప్రమత్తమయ్యారు. తుఫాన్ పరిస్థితిపై కూటమి నాయకత్వంతో గ్రూప్‌ కాల్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. అనంతరం స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ పట్టణంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఏలూరు రోడ్, బస్టాండ్, మార్కెట్ సెంటర్, జైన్ స్ట్రీట్, RDO ఆఫీస్ రోడ్, కొత్తపేటలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. రోడ్లపై కూలిన చెట్ల తొలగింపు పనులను పరిశీలించారు. పట్టణంలో 80 శాతం చెట్ల తొలగింపు పూర్తి అయ్యింది. దీంతో మున్సిపల్ యంత్రాంగం పనితీరును అభినందించారు.అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని.. బైక్‌లపై రావద్దని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు. పార్టీ నేతలు ప్రజలతో టచ్‌లో ఉండాలని ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని.. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హెచ్చరించారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Driving TourVenegandalaRamuReviewCycloneSelfGudivada

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News