05/11/2026, Thursday · 08:34:41 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో రాతి గుహ

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 12:34 PM ములుగు 14

ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో రాతి గుహ
Want this news as a newspaper clip?Print News Clip

ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామరవాయి, భూపతిపూర్‌ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో గుహ ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. జింకల పడ అనే అటవీ ప్రాంతంలో గుడ్డేలుగు గుహ ఉందని, అటు వైపు వెళ్తే ప్రమాదమని ప్రచారం జరుగుతోంది. దామరవాయి గ్రామానికి చెందిన యువకుడు కార్తీక్‌ తన స్నేహితులు మహేష్‌, నాగరాజులతో కలి సి ఈనెల 20న గుహను సందర్శించాడు. గ్రామం నుంచి గుహ జాడలు గుర్తిస్తూ గంటలపాటు అడవిలో వీరు ప్రయాణించారు. చివరకు గుహను గుర్తించామని కార్తీక్‌ తెలిపాడు. సోమవారం గుహను సందర్శించగా అది మూడు మీటర్ల సొరంగం కనిపించింది.

లోపల సన్నటి దారి ఉంది. వ్యక్తి పడుకొని వెళ్లేలా మూడు మీటర్ల పొడవుతో సొరంగం కనిపించింది. అది దాటిన తర్వాత గది ఉంది. అందు లోవ్యక్తి పడుకునే విధంగాఏర్పాటు చేసి ఉంది. ఈ గుహలో గబ్బిలాలు వందల సంఖ్యలో వేలాడుతూ కనిపించాయి. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ గుహను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. ఆనవాలనుబట్టి ఇందులో ఆదిమానవులు నివసించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. గుహకు దగ్గరలోనే దామరవాయి రాక్షస సమాధులు ఉన్నాయని, ఈ ప్రాంతంలో అదిమానవులు నివసించారనడానికి ఇది నిదర్శనమని చెబుతున్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Tadvai ForestsRockCaveMuluguDistrict

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News