05/11/2026, Thursday · 09:02:43 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

యువశక్తితో బలమైన భారత్.. చిన్మయ సమ్మేళనంలో మోదీ ప్రసంగం

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 2:08 PM జాతీయం 4

యువశక్తితో బలమైన భారత్.. చిన్మయ సమ్మేళనంలో మోదీ ప్రసంగం
Want this news as a newspaper clip?Print News Clip

యువశక్తిని సద్వినియోగం చేసుకోవడం ద్వారానే బలమైన భారత్‌ను నిర్మించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. శుక్రవారం ఢిల్లీలోని భారత్ మండపంలో 'చిన్మయ అమృత మహోత్సవ గ్లోబల్ సమ్మేళన్'ను ప్రధాని మోదీ ప్రారంభించారు. చిన్మయ మిషన్ 75 ఏళ్ల ఉత్సవాల ముగింపు కార్యక్రమం నేటి నుంచి అక్టోబర్ 25 వరకు జరగనుంది.ఈ కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ... 1993లో ఆధ్యాత్మిక గురువు స్వామి చిన్మయానందతో జరిగిన తన చివరి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ భేటీలో దేశాభివృద్ధిలో యువత పాత్ర, యువశక్తిని పెంపొందించడంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు మోదీ వెల్లడించారు. స్వామిజీతో సమావేశం జరిగిన కొన్నేళ్లకే ప్రజలు తనకు గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశం కల్పించారని, అప్పటి నుంచి తన విధానాలన్నింటిలోనూ యువతే కేంద్ర బిందువుగా నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు. అలాగే, చికాగోలో జరిగిన 'పార్లమెంట్ ఆఫ్ ది వరల్డ్ రిలీజియన్స్' శతాబ్ది ఉత్సవాలకు హాజరుకావాలంటూ తాను చేసిన ఆహ్వానాన్ని స్వామి చిన్మయానంద అప్పట్లో అంగీకరించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు.

చిన్మయ మిషన్ కేవలం ఒక సాధారణ సంస్థ కాదని, ఒక సనాతన ఆధ్యాత్మిక తత్వానికి రూపమని మోదీ అభివర్ణించారు. తన నాగరికతా మూలాల నుంచే భారతదేశం గుర్తింపు పొందుతోందని, మన దేశమే మన స్కృతికి జన్మస్థానమని మోదీ స్పష్టం చేశారు. చిన్మయ అమృత మహోత్సవ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 300 రోజుల్లో 40,000 కిలోమీటర్లు ప్రయాణించి, లక్షలాది మందిని కలుసుకున్న యువతీయువకుల బృందాన్ని ప్రధాని ప్రశంసించారు. వేదాంత, భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ అందించే లక్ష్యంతో 1951లో స్వామి చిన్మయానంద ఈ మిషన్‌ను ప్రారంభించారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

strong IndiayouthpowerModiaddressesChinmayaSummit

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News