05/11/2026, Thursday · 08:58:46 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు.. టీ20ల్లో 150 వికెట్లకు ఒక్క అడుగు దూరంలో!

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 3:00 PM జాతీయం 14

అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు.. టీ20ల్లో 150 వికెట్లకు ఒక్క అడుగు దూరంలో!
Want this news as a newspaper clip?Print News Clip

వెల్లింగ్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌, భారత్ మధ్య మూడో టీ20 మ్యాచ్‌ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి.. 198 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌల‌ర్ అర్ష‌దీప్ సింగ్ అరుదైన రికార్డును సాధించాడు. న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్‌ను ఔట్ చేయ‌డం ద్వారా అర్ష‌దీప్ 149వ వికెట్ తన‌ ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా టీ20ఐ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో పేసర్‌గా నిలిచాడు.ఈ క్ర‌మంలో బ‌హ్రెయిన్‌కు చెందిన రిజ్వాన్ బ‌ట్‌ను అర్ష‌దీప్‌ అధిగ‌మించ‌డంతో అత‌డు నాలుగో స్థానానికి ప‌డిపోయాడు. రిజ్వాన్ ఖాతాలో 148 వికెట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ స్టార్ బౌలర్ టిమ్ సౌథీ 160 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్ బౌల‌ర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ 163 వికెట్లతో రెండో స్థానంలో, ఐర్లాండ్ బౌల‌ర్ మార్క్ అడైర్ 142 వికెట్లు ఐదో స్థానంలో ఉన్నారు. ఎడమచేతి వాటం పేసర్ అయిన అర్షదీప్‌ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇంకొక వికెట్ సాధిస్తే.. మరో అరుదైన ఘనత సాధిస్తాడు. 150 వికెట్ల మైలురాయిని తాకిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

rikardu ti20lloarshdipsimgarudainaviketlakuokkaaduguduramlo

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News