05/11/2026, Thursday · 08:58:45 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

భారతదేశ పేద ప్రజల ఆశాజ్యోతి "శ్రీమతి ఇందిరాగాంధీ "

భవ్య జర్నలిస్ట్ 30/10/2026 7:58 PM జాతీయం 22

భారతదేశ పేద ప్రజల ఆశాజ్యోతి "శ్రీమతి ఇందిరాగాంధీ "
Want this news as a newspaper clip?Print News Clip
  • భారతదేశ ఉక్కు మహిళ " శ్రీమతి ఇందిరాగాంధీ "( lron Lady of lndia ).
  • నవభారత నిర్మాత, భారతరత్న" శ్రీమతి ఇందిరాగాంధీ ".

స్వతంత్ర భారతదేశ ప్రధమ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ దంపతుల ముద్దుల బిడ్డ ఇందిర. జవహర్ లాల్, కమలాల్ నెహ్రూ ఏకైక సంతానము ఇందిరా ప్రియదర్శిని, ఈమె అలహాబాద్ లోని ఆనంద్ భవనంలో నవంబర్ నెల 19వ తేదీన1917లోజన్మించారు. నెహ్రూ ప్రసిద్ధ విద్యాసంస్థలైన శాంతినికేతన్, విశ్వ భారతి, బొంబాయి, పూణే లలో ఇందిరాప్రియదర్శినివిద్యాభ్యాసము పూర్తి చేశారు. ఇందిరా ప్రియదర్శిని చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర పోరాట ఉద్యమాలలో పాల్గొనేవారు. ఆమె చిన్న వయసులో తోటి వారి పిల్లలతో కలిసి దేశభక్తి భావాలు పెంపొందించుకునేవారు.మోతిలాల్ నెహ్రూ గారికి మనమరాలు (ఇందిర) గారు అంటే అమితమైన ప్రేమ. స్వాతంత్ర ఉద్యమకారులు బాలగంగాధర్ తిలక్, సరోజినీ నాయుడు, మహాత్మా గాంధీ...... వంటి ప్రముఖులు, కమలా నెహ్రూ ప్రముఖులు జైలుకు వెళ్లారు. ఆ సమయంలో ఇందిరా ఒంటరి జీవితాన్ని గడపవలసి వచ్చింది. అలాంటి కాలములో ఇందిరా ప్రియదర్శిని బ్రిటీష్ వారిని ఎదిరించి పోరాట దీక్ష కలిగినఒకదేశభక్తురాలిగా ఊహించుకుంటూ ఆటలు ఆడేవారు. ఆ కాలంలో ఒకరి నుండి ఒకరికి వార్తలు చేరడం చాలా కష్టంగా ఉండేది ఆ సమయంలో తోటి స్నేహితులతో, పిల్లలతో కలిసి ఇందిరా" వానర సేన" అనే సంస్థను స్థాపించారు. మనము పిల్లలమైన భారత దేశ స్వాతంత్రం కోసం మన వంతుగా కృషి చేయాలని దేశభక్తిని అందరిలో కల్పించేవారు.ఇందిరా ప్రియదర్శిని ఆంగ్లేయుల పాలనలో దేశము ఆర్థికంగా, సామాజికంగా అనేక సమస్యలతో,అల్లోకల్లోలంగా ఉన్నది అలాంటి సమయంలో దేశంలో జాతీయ భావాన్ని పెంపొందించవలసిన అవసరం ఉందని భావించారు. నెహ్రు ఇందిరా ప్రియదర్శిని భారతదేశ సంస్కృతిని, దేశ చరిత్రను, ప్రపంచ చరిత్రను ఉత్తరాల ద్వారా తెలియజేసేవారు.
జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రికి కార్యదర్శిగా ఎలాంటి జీతం తీసుకోకుండా పనిచేశారు.1964 లో తండ్రి నెహ్రూ వృద్ధాప్యంతో సహజ మరణమైన తర్వాత ఇందిరా గాంధీరాజ్యసభకుఎన్నికయ్యారు. లాల్ బహుదూర్ శాస్త్రి మంత్రిమండలిలో ప్రసార శాఖ మంత్రిగా చేసిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుంది.
 జవహర్లాల్ నెహ్రూ తన తనయ ఇందిరా ప్రియదర్శిని "చైల్డ్ ఆఫ్ రివల్యూషన్ "గా చెప్పేవారు. నెహ్రూ కుటుంబము త్యాగస్ఫూర్తితో ఇందిర తండ్రి అడుగుజాడలలో నడుస్తూమహత్తరమైనటువంటికార్యక్రమాలునిర్వహించారు.
 భారత ప్రజాస్వామ్యంలో అసంఖ్యాక పేద ప్రజల ఆశాజ్యోతి గా, సమసమాజ నిర్మాణానికి నడుం బిగించి, పేదరికం నిర్మూలన దిశలో జాతిని పురోగమింప చేశారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యము భూ సంస్కరణలు, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, సోషలిజం, సామాజిక న్యాయము సాధించే దిశలో సామాన్య ప్రజాజీవనము నెహ్రు అడుగుజాడల్లో నడుస్తూ కాంతిరేఖలు ప్రసరింప చేశారు.
 1977లో జాతీయ భవితవ్యానికి అవరోధాలు సంభవించి అవినీతి జాతి జీవనాన్ని హతలాకుతలం చేయడం వల్ల ఇందిరాగాంధీ అధికారాన్ని కోల్పోయి అరెస్టు కావడంజరిగింది.అయినప్పటికీ మనో ధైర్యముతో, అంచెలంచెల ప్రజల విశ్వాసముతో, ఆశీస్సులతో 1980 మధ్యంతర ఎన్నికలలో ఘన విజయం సాధించారు. కొంతకాలానికి అత్యవసర పరిస్థితి విధించిన చీకటి రోజులు తాత్కాలికంగా తీవ్ర అవరోధాలు మానసిక వేదన కలిగించినప్పటికీ దెబ్బతిన్న బెబ్బులిపులిలాగా,ధైర్యసహసాలతో ప్రజల వద్దకు వెళ్లి ప్రజాహృదయనేతగా చిరాస్మరణీయులయ్యారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయంగా ప్రపంచంలో శాంతి సౌబ్రాతత్వము నెల కల్పగల అత్యంత ప్రతిభావంతమైన రాజనీతి జ్ఞత అలీన దేశాల ఐక్యత ప్రధాన లక్ష్యాలను సాధించిన మొదటి మహిళా ప్రధానమంత్రి. ఇందిరాగాంధీ సుమారుగా రెండు దశాబ్దాలు జీవితాంతం జయాపజయాలను సమానంగాస్వీకరించి ఓడిదుడుకులనుఎదుర్కొంటూ
 జాతీయ, అంతర్జాతీయ రంగాలలో సుప్రతిష్టతో కీర్తి పతాకాన్ని ఎగరవేసిన ఉక్కు మహిళ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ. ఇందిరాగాంధీ జీవితంలో పెద్ద కోడలు సోనియా గాంధీ చూపించిన ఆత్మీయత,ప్రేమానురాగాలు స్థైర్యన్ని అందించాయి అనుటలో అతిశయోక్తి లేదు.
 భారతదేశ రాజధాని అయిన ఢిల్లీలో స్వగృహములో తనను కంటికి రెప్పలా కాపాడవలసిన సెక్యూరిటీ గార్డులు 1984 అక్టోబర్ 31 ఆమెపై అతి దారుణంగా కాల్పులు జరిపారు. భారత ప్రియతమ ప్రధాని ఇందిరాగాంధీ అమానుషంగా హత్యకు గురైనవి విషాద సంఘటన ప్రపంచాన్ని కుదిపి వేసింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హఠాత్ మరణం భారత జాతికి, ప్రపంచాన్ని దిగ్భ్రాంతిని కలిగించింది. ఇందిరాగాంధీ మరణించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రులు క్యాబినెట్ మంత్రులు రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడము జరిగింది. P. V.నరసింహారావు బలరాంజక్కర్,అరుణ్ నెహ్రూ పార్థసారథి,....... ప్రముఖులు ఏకాభిప్రాయముతో దేశాధ్యక్షుడు జ్ఞానీ జైల్ సింగ్ గారు రాజీవ్ గాంధీ గారిని భారత దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

వ్యాసకర్త : ఎం.ఎండి. రఫీ గణిత శాస్త్ర అధ్యాపకులు. నంద్యాల. ( బలపనూరు).

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

భారతదేశ పేద ప్రజల ఆశాజ్యోతి "శ్రీమతి ఇందిరాగాంధీ "

Indira GandhiAshajyothiIndiaPoorPeopleMrs

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News