05/11/2026, Thursday · 09:02:45 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

భువీ.. విమర్శలను పట్టించుకోకుండా నీలా నువ్వు ఆడు: మోర్నీ మోర్కెల్

భవ్య జర్నలిస్ట్ 26/10/2026 11:54 AM జాతీయం 5

భువీ.. విమర్శలను పట్టించుకోకుండా నీలా నువ్వు ఆడు: మోర్నీ మోర్కెల్
Want this news as a newspaper clip?Print News Clip

భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక సూచనలు చేశాడు. విమర్శలను పట్టించుకోకుండా తన సహజమైన ఆటను కొనసాగించాలని తెలిపాడు. నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి భువీ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లో తుది జట్టులో చోటు దక్కినప్పుడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. దీంతో భువీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో మోర్కెల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.‘నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన ప్లేయర్‌పై సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఐపీఎల్‌లో భువీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. షెడ్యూల్ కారణంగా పరిమిత సమయం వరకే ప్రాక్టీస్ ఉంటుంది. తక్కువ సమయం వ్యవధిలోనే అంతర్జాతీయ మ్యాచ్‌లకు సిద్ధం కావాల్సి ఉంటుంది. భువనేశ్వర్‌ తన ఆటను తిరిగి అందిపుచ్చుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి. అతడిలో అనుభవంతో పాటు అపారమైన ప్రతిభ ఉంది. జట్టులోకి వచ్చినప్పటి నుంచే నేను అతడికి చెప్పింది ఒక్కటే.. దేనికోసమూ పరుగులు పెట్టొద్దు. నీ సహజమైన ఆటను నువ్వు వాడు. బయట నుంచి వచ్చే విమర్శలు, అంచనాలను పట్టించుకోవద్దు’ అని మోర్కెల్‌ వెల్లడించాడు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

morni morkelbhuvivimarshalanupattimchukokumdanilanuvvuadu

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News