05/11/2026, Thursday · 09:02:35 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

రూ.2.12 లక్షల కోట్ల రక్షణ కొనుగోళ్లకు DAC ఆమోదం

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 10:57 AM జాతీయం 10

రూ.2.12 లక్షల కోట్ల రక్షణ కొనుగోళ్లకు DAC ఆమోదం
Want this news as a newspaper clip?Print News Clip

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 'డిఫెన్స్ ఆక్విజిషన్ కౌన్సిల్' (DAC) త్రివిధ దళాలకు (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) సంబంధించి రూ. 2.12 లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలకు 'అక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ' (AoN - ప్రాథమిక ఆమోదం) తెలపింది.

ఈ ఆమోదం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY27) లోనే అతిపెద్ద DAC క్లియరెన్స్‌గా నిలిచింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు క్లియర్ అయిన మొత్తం AoN విలువ రూ. 3.7 లక్షల కోట్లకు చేరింది. మొత్తం ఆమోదించిన విలువలో దాదాపు 82శాతం నిధులను దేశీయ ఉత్పత్తుల కొనుగోళ్లకే కేటాయించారు. ఇది భారత్‌లో రక్షణ రంగ తయారీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.ఈ ప్రతిపాదనల ద్వారా హై-మొబిలిటీ వాహనాలు, ట్రాక్డ్ గన్ సిస్టమ్స్, లైట్ మల్టీరోల్ హెలికాప్టర్లు, స్వల్ప శ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థలు, కౌంటర్-డ్రోన్ సిస్టమ్స్, సుదూర ప్రాంత నిఘా డ్రోన్లు, నావికా దళ ప్లాట్‌ఫారమ్‌లు కొనుగోలు చేసే వీలు కలుగుతుంది.'కోటక్ నియో' విశ్లేషణ ప్రకారం, ప్రకటిత జాబితాలోని వివిధ రకాల ఎలక్ట్రానిక్స్, డ్రోన్, నిఘా పరికరాల వల్ల BEL సంస్థ అత్యధిక ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఇక, లైట్ మల్టీరోల్ హెలికాప్టర్ ప్రాజెక్టులు HAL కంపెనీకి పెద్ద ఎత్తున ఆర్డర్లను అందించగలవని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ 'గోల్డ్‌మన్ శాచ్స్' పేర్కొంది. స్వల్ప శ్రేణి వైమానిక రక్షణ క్షిపణులు, వైమానిక దళ ఆయుధ సంపత్తి, డ్రోన్ ఈకోసిస్టమ్ ద్వారా BDL లబ్ధి పొందనుంది.ఈ సంస్థలతోపాటు మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్, BEML కంపెనీలు కూడా ఈ ఆమోదాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.కాగా, DAC ఇచ్చే 'అక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ' (AoN) అనేది రక్షణ పరికరాల సేకరణ ప్రక్రియలో ఒక ప్రాథమిక సూత్రప్రాయ ఆమోదం మాత్రమే. ఇది నేరుగా కాంట్రాక్ట్ లేదా ఆర్డర్ కేటాయించినట్లు కాదు. ఈ ప్రకటన ద్వారా వచ్చే అసలు ఆర్డర్లు కంపెనీలకు అందడానికి FY2028 నుంచి FY2030 మధ్య సమయం పట్టవచ్చని సమాచారం.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

purchases worthDACapprovesdefencelakhcrore

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News