05/11/2026, Thursday · 09:02:48 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

సీజేపీ నేతల పిటిషన్.. ఫ్రాన్స్‌ అల్లర్లను ప్రస్తావించిన ఢిల్లీ హైకోర్టు

భవ్య జర్నలిస్ట్ 21/10/2026 4:24 PM జాతీయం 4

సీజేపీ నేతల పిటిషన్.. ఫ్రాన్స్‌ అల్లర్లను ప్రస్తావించిన ఢిల్లీ హైకోర్టు
Want this news as a newspaper clip?Print News Clip
  • జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపును సవాలు చేస్తూ సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపును సవాలు చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా డిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై నేడు విచారణ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసనకు పోలీసు అనుమతుల వెనకున్న ఉద్దేశం నిరసనకారులను అడ్డుకోవడం మాత్రమే కాదని జస్టిస్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. నిరసనల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకూడదన్న లక్ష్యం కూడా ఉందని పేర్కొంది. అక్టోబర్ 13న జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా ప్రయత్నించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సందర్భంగా సోమవారం వరకూ తమకు విధించిన జ్యుడీషియల్ కస్టడీని బుధవారం వరకూ మళ్లీ పొడిగించడాన్ని దాస్, రాంకా కోర్టులో సవాలు చేశారు.పిటిషన్లపై విచారణ సమయంలో న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జంతర్‌మంతర్ నిరసనలకు వేదిక కాదని ప్రభుత్వం ప్రకటించాక అక్కడకు దాస్, రాంకా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని కోర్టు ప్రశ్నించింది. ‘బారికేడ్ల ఏర్పాటు వెనుక ఒక లక్ష్యం ఉంది. మీరు వాటిని లెక్కచేయక ముందుకు వెళితే మిగతా వారూ అలాగే చేసే అవకాశం ఉంది. అలాంటి వారిని మీరు అదుపు చేయలేకపోవచ్చు’ అని పేర్కొంది.

‘ఇలాంటి పరిస్థితులను మనం విదేశాల్లో చూస్తున్నాము. మొదట విద్యార్థుల సారథ్యంలో మొదలైన నిరసనలు చివరకు తీవ్ర రూపం దాల్చాయి. భవనాలకు నిప్పు పెట్టడాలు, షాపుల్లో లూటీలు జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండేందుకే పోలీసు అనుమతులు ఉన్నాయి. వేరెవరైనా ఈ నిరసనల్లో చేరి మీ పేరు చెడగొట్టకుండా ఉండేందుకు పోలీసుల అనుమతులు ఉపయోగపడతాయి’ అని కోర్టు పేర్కొంది. ఇక డీనోటిఫై చేసిన ప్రాంతంలో నిరసన చేపట్టిన వారిపై ఏ స్థాయిలో చర్యలు తీసుకోవాలనే అంశాన్ని తదుపరి పరిశీలిస్తామని కూడా కోర్టు తెలిపింది. ఈ సందర్భంగా దాస్, రాంకాల వయస్సులను అడిగి తెలుసుకున్న న్యాయస్థానం ఏయే వయసుల వారిని జెన్ జీ, మిలీనియల్స్‌గా పిలుస్తారని సరదాగా ప్రశ్నించింది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

సీజేపీ నేతల పిటిషన్.. ఫ్రాన్స్‌ అల్లర్లను ప్రస్తావించిన ఢిల్లీ హైకోర్టు

France RiotsDelhiHighCourtRefersCJPLeadersPetition

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News