05/11/2026, Thursday · 09:02:31 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

చిరిగిన రూ.10 నోటును మార్చమన్నందుకు చెంపదెబ్బలు.. అవమానంతో డెలివరీ బాయ్ ఆత్మహత్య

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 10:53 AM జాతీయం 4

చిరిగిన రూ.10 నోటును మార్చమన్నందుకు చెంపదెబ్బలు.. అవమానంతో డెలివరీ బాయ్ ఆత్మహత్య
Want this news as a newspaper clip?Print News Clip

 చిరిగిన రూ.10 నోటును మార్చి ఇవ్వాలని కోరినందుకు ఓ కస్టమర్ దాడి చేయడంతో డెలివరీ బాయ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ రాజధానిలో కలకలం రేపుతోంది. అందరి ముందు చెంపదెబ్బలు కొట్టడంతో పాటు తన పేదరికంపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ బాధిత యువకుడు రికార్డ్ చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. తన పేదరికం కారణంగా తనకు న్యాయం జరగదని, అందుకే ప్రాణాలు తీసుకుంటున్నానని అతను చెప్పిన మాటలు హృదయాలను కదిలిస్తున్నాయి. ఈ ఘటన ఢిల్లీలో అక్టోబర్ 4న జరగగా.. డెలివరీ బాయ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.వీడియో ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌లో సమీర్ హుస్సేన్ (23) డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 4న రాత్రి 10.30 గంటలకు తూర్పు ఢిల్లీలోని వినోద్ నగర్‌లో రాంపాల్ సింగ్ అనే వ్యక్తికి కాఫీ ఆర్డర్ అందించేందుకు వెళ్లినట్లు సమీర్ తెలిపాడు. సుమారు రూ.150 విలువైన ఆర్డర్‌కు నగదు చెల్లించేందుకు కస్టమర్ 15 నిమిషాలు తీసుకున్నా తాను అభ్యంతరం చెప్పలేదని పేర్కొన్నాడు. అయితే, చిరిగిన రూ.10 నోటును మార్చి ఇవ్వాలని మర్యాదగా కోరినందుకు కస్టమర్ తనను మూడుసార్లు చెంపదెబ్బ కొట్టాడని ఆరోపించాడు. తాను తిరిగి దాడి చేయలేదని, తన పేదరికాన్ని ప్రస్తావిస్తూ అవమానించడంతో తీవ్రంగా కలత చెందానని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. సైకిల్‌పై ఆర్డర్లు డెలివరీ చేస్తూ స్వయంకృషితో జీవించాలని కోరుకున్నానని చెప్పుకొచ్చాడు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు.

అనంతరం, అక్టోబర్ 5న సమీర్ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్సపొందుతూ అక్టోబర్ 20న ఆ యువకుడు మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, సమీర్‌కు న్యాయం చేయాలని అతని కుటుంబ సభ్యులు, తోటి డెలివరీ బాయ్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన దేశ రాజధానిలో సంచలనంగా మారింది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

commits suicideDeliveryboyhumiliationexchangingtornRs10note

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News