05/11/2026, Thursday · 09:02:42 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కర్ణాటకలో కన్నడిగులకే ప్రాధాన్యం.. ఐటీ సంస్థలకు డీకే శివకుమార్ హెచ్చరిక

భవ్య జర్నలిస్ట్ 25/10/2026 5:34 PM జాతీయం 4

కర్ణాటకలో కన్నడిగులకే ప్రాధాన్యం.. ఐటీ సంస్థలకు డీకే శివకుమార్ హెచ్చరిక
Want this news as a newspaper clip?Print News Clip
  • బెంగళూరులో కన్నడిగులకు ఉద్యోగావకాశాలు నిరాకరిస్తున్నారనే ఆరోపణలపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ స్పందించారు. స్థానిక అభ్యర్థుల హక్కులు, అవకాశాలను ఉద్దేశపూర్వకంగా పక్కనబెడితే ప్రైవేటు సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
  • కర్ణాటకలో కన్నడిగులకే ప్రాధాన్యం.. ఐటీ సంస్థలకు డీకే శివకుమార్ హెచ్చరిక

 బెంగళూరులోని కొన్ని విద్యాసంస్థలు, ప్రైవేటు ఐటీ కంపెనీలు కన్నడిగులకు ఉద్యోగావకాశాలు ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నాయనే ఆరోపణలపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. 'కర్ణాటకలో కన్నడిగుడే సార్వభౌముడు' అని ఆయన స్పష్టం చేస్తూ, కన్నడ భాష మాట్లాడే వారికి ఉద్దేశపూర్వకంగా ఉద్యోగాలు నిరాకరిస్తే ప్రైవేటు సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

వివాద నేపథ్యం

బెంగళూరులోని ఐటీ కంపెనీల్లో నియామకాల సమయంలో భాషా ప్రాతిపదికన వివక్ష చూపుతున్నారని ఒక యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో సంచలనం సృష్టించింది. ఇంటర్వ్యూలు లేదా షార్ట్‌లిస్టింగ్ సమయంలో తమ మాతృభాష 'కన్నడ' అని చెప్పిన అభ్యర్థులను తిరస్కరిస్తున్నారని ఆ యువతి ఆరోపించింది. కంపెనీలు తక్కువ జీతాలకు పనిచేయించుకోవడానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే తెలుగు, తమిళ భాషా అభ్యర్థులకే ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొంది.

అంతేకాదు, బెంగళూరులోని స్థానిక కళాశాలల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని, ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆమె ప్రభుత్వానికి విన్నవించుకుంది. కన్నడ ఉద్యమకారుడు రూకేష్ రాజన్న కూడా ఈ అంశంపై స్పందిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

డికే శివకుమార్ స్పందన

డికే శివకుమార్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) వేదికగా స్పందిస్తూ.. ప్రైవేట్ సంస్థలు కన్నడిగులను ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టినట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 'ఎట్టిపరిస్థితుల్లో కన్నడిగుల హక్కులు, గౌరవం, అవకాశాలను తక్కువ చేయడానికి ప్రభుత్వం అంగీకరించదు' అని స్పష్టం చేశారు.

బెంగళూరును ప్రపంచం భారతదేశపు ఐటీ రాజధానిగా చూస్తోందని, తమ కన్నడిగుల నైపుణ్యాలు, సామర్థ్యాలపై ప్రభుత్వానికి ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.

ప్రతిపక్ష బీజేపీ విమర్శలు

ఈ అంశంపై బీజేపీ అధికార ప్రతినిధి అశోక్ గౌడ స్పందిస్తూ, ప్రభుత్వం ఉపాధి అవకాశాలను పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రైవేటు రంగంలో కన్నడిగులను ప్రోత్సహించేలా, కొత్త ఉద్యోగాల సృష్టిపై శివకుమార్ నిర్దిష్టమైన ప్రణాళికను వివరించాలని ఆయన కోరారు

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Shivakumar warnscompaniesprioritiseKannadigasKarnataka

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News