05/11/2026, Thursday · 08:58:42 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

విద్వేషాన్ని వ్యాప్తి చేయకండి.. రాహుల్ గాంధీపై నిర్మలా సీతారామన్ ఆగ్రహం

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 4:41 PM జాతీయం 14

విద్వేషాన్ని వ్యాప్తి చేయకండి.. రాహుల్ గాంధీపై నిర్మలా సీతారామన్ ఆగ్రహం
Want this news as a newspaper clip?Print News Clip

 టాటా గ్రూప్‌పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించారు. విద్వేషాన్ని వ్యాప్తి చేయొద్దని రాహుల్ గాంధీకి హితవు పలికారు. టాటా సంస్థకు సంబంధించిన వివాదంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. టాటా గ్రూప్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు (Tata Group controversy).వ్యాపారవేత్తలు తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించాలని, భారతీయ వ్యాపార సంస్థలు రాజకీయ నాయకుల చేతుల్లో ఆటవస్తువులుగా మారకూడదని వ్యాఖ్యానించారు. 'టాటా గ్రూప్‌ను ఉద్దేశపూర్వకంగా నాశనం చేస్తున్నారు. భారత వ్యాపారం మోదీ, షాల ఆటవస్తువు కాదు. మీకు ధైర్యం లేదు. మాకు ఉంది. మేము న్యాయం జరిగేలా చూస్తాము' అని రాహుల్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ తీరును తప్పుబట్టారు. రాజకీయ విమర్శలు చేసే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు (Congress vs BJP).

టాటా గ్రూప్‌నకు చెందిన టాటా సన్స్ సంస్థలో నాయకత్వానికి సంబంధించిన అంశాలు చర్చకు దారితీశాయి (Tata Group dispute). టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ పునర్నియామక ప్రక్రియపై టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సంస్థ పాలన, నిర్ణయాల ప్రక్రియపై చర్చ మొదలైంది. ఈ వివాదాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. రాహుల్ విమర్శలను నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Nirmala SitharamanDonspreadhatredRahulGandhi

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News