05/11/2026, Thursday · 08:58:42 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

చైనా చొరబాటు అంటూ తప్పుడు ప్రచారం.. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: కిరణ్ రిజిజు

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 3:11 PM జాతీయం 14

చైనా చొరబాటు అంటూ తప్పుడు ప్రచారం.. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: కిరణ్ రిజిజు
Want this news as a newspaper clip?Print News Clip

 అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా చొరబడిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, దీనిపై కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. చైనా వాహనాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయని, అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలపై చైనా నియంత్రణ సాధించిందని, సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న భారత సైనికులకు అవసరమైన సరఫరాలు అందడం లేదని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి (Kiren Rijiju vs Congress).ఆ వీడియోలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రీతూ చౌధురి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు నిజమైనవి కావని భారత సైన్యం తేల్చి చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను చైనా స్వాధీనం చేసుకుందని సీనియర్ సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కాళియా చెప్పినట్లు ప్రచారమైన వీడియోను భారత సైన్యం ఖండించింది. ఆ వీడియోను ఏఐ సాయంతో మార్పులు చేసి రూపొందించినట్లు స్పష్టం చేసింది. గతంలో జరిగిన మీడియా సమావేశానికి సంబంధించిన దృశ్యాలకు తప్పుడు వ్యాఖ్యలను జోడించినట్లు వెల్లడించింది (Indian Army fact check).అలాగే, చైనా వాహనాలు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాయని పేర్కొంటూ జరిగిన ప్రచారంపై కూడా సైన్యం వివరణ ఇచ్చింది (Fake China posts). సిక్కింలోని నాథు లా వద్ద అనుమతితో జరిగే సరిహద్దు వాణిజ్యానికి సంబంధించిన వాహనాల దృశ్యాలను తప్పుదోవ పట్టించే విధంగా చూపించినట్లు తెలిపింది. సున్నితమైన సరిహద్దు అంశాలపై నిర్ధారణ లేని సమాచారాన్ని ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో అనవసర ఆందోళన ఏర్పడుతుందని, ఇలాంటి చర్యల వల్ల సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల మనోధైర్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని కిరణ్ రిజుజు అన్నారు. సరిగ్గా నిర్ధారించుకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే తపనతో తప్పుడు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

kshamapana cheppalichainachorabatuamtutappudupracharamkamgres

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News