05/11/2026, Thursday · 09:02:29 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

మలబార్ గోల్డ్ పై FIR నమోదు: నమ్మకం పేరిట నిలువు దోపిడీ!

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 10:26 AM జాతీయం 15

మలబార్ గోల్డ్ పై FIR నమోదు: నమ్మకం పేరిట నిలువు దోపిడీ!
Want this news as a newspaper clip?Print News Clip
  • బిలాస్‌పూర్‌లోని మలబార్ గోల్డ్ షోరూమ్‌కి ఒక కస్టమర్ వెళ్లాడు. అతని కోరిక చాలా సింపుల్: తన దగ్గరున్న పాత 22 క్యారెట్ల HUID హాల్‌మార్క్ ఉన్న బ్రాస్‌లెట్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకోవడం.
  • షోరూమ్ సిబ్బంది దాన్ని తమ XRF ప్యూరిటీ టెస్టింగ్ మెషీన్‌లో పరీక్షించారు. ఒక్కసారి కాదు... రెండుసార్లు... ఏకంగా మూడుసార్లు టెస్ట్ చేశారు. ప్రతీసారీ రీడింగ్ ఒకేలా వచ్చింది: కేవలం 20 క్యారెట్ మాత్రమే!
  • పైగా ఆ బ్రాస్‌లెట్‌పై అసలు హాల్‌మార్కే లేదని బుకాయించారు.
  • వెంటనే ఆ కస్టమర్ ఆ బ్రాస్‌లెట్ అమ్మిన లోకల్ జ్యువెలర్‌కి ఫోన్ చేసి రప్పించాడు. ఆ జ్యువెలర్ స్వయంగా వచ్చి HUID నంబర్‌ని నిర్ధారించి, వాళ్ల ముందే మళ్లీ టెస్ట్ చేయాలని పట్టుబట్టాడు.
  • అదే మెషీన్... అదే బ్రాస్‌లెట్... అదే రూమ్!
  • ఈసారి అక్కడి ఉద్యోగి మెషీన్‌లో ఏదో 'సెట్టింగ్' మార్చాడు. అంతే!
  • కట్ చేస్తే రీడింగ్ ఒక్కసారిగా 916 – ప్యూర్ 22 క్యారెట్‌గా మారిపోయింది! 
  • ఆ లోకల్ జ్యువెలర్ ఈ తతంగాన్నంతా వీడియో రికార్డ్ చేశాడు. వెంటనే సరఫా అసోసియేషన్ రంగంలోకి దిగింది.
  • పోలీసులు షోరూమ్ మేనేజర్, మెషీన్ ఆపరేటర్‌లపై FIR నమోదు చేశారు. ఆ టెస్టింగ్ మెషీన్, సీసీటీవీ DVRను స్వాధీనం చేసుకున్నారు.
  • ఇదేదో చిన్న వీధి చివరి దుకాణం కాదు... దేశవ్యాప్తంగా 'నమ్మకం, స్వచ్ఛత, BIS ప్రమాణాలు' అంటూ రోజూ ప్రకటనలు గుప్పించే "మలబార్ గోల్డ్"!
  • ఒకే ఒక్క బ్రాస్‌లెట్... రెండు రకాల రీడింగ్‌లు...ఏకంగా 8% బంగారం విలువలో తేడా! ఇక్కడ మారిన ఏకైక విషయం ఏంటంటే, పక్కన నిలబడి ఎవరు చూస్తున్నారు అనేది మాత్రమే!
  • ఒక హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణం, కస్టమర్ ఎక్స్ఛేంజ్ చేసుకోగానే అద్భుతంగా 2 క్యారెట్లు తగ్గిపోయి... గట్టిగా నిలదీయగానే మళ్లీ 2 క్యారెట్లు ఎలా పెరుగుతుంది? అసలు ఆ మెషీన్ దేన్ని టెస్ట్ చేస్తోంది?
  • కస్టమర్లు మలబార్ లాంటి పెద్ద షోరూమ్‌కి వెళ్లేది...బంగారం అమ్మేటప్పుడు మాత్రమే బయటపడే ఇలాంటి 'క్యాలిబ్రేషన్ తప్పుల' కోసం కాదు. తమ బిల్లుపై ముద్రించిన స్వచ్ఛత కోసం!
  • FIR నమోదు కావడం నిజం.
  • ఆ రెండు రకాల రీడింగులు రికార్డుల్లో ఉండటం నిజం.
  • పోలీసులు మెషీన్‌ను సీజ్ చేయడం కూడా నిజం!
  • ఒకే బంగారానికి మళ్లీ 22 క్యారెట్ అని రావడానికి మధ్యలో ఆ 'సెట్టింగ్' ఎందుకు మార్చాల్సి వచ్చిందో మలబార్ ఇప్పటికీ సమాధానం చెప్పలేదు. 
  • వాళ్లు క్లారిటీ ఇచ్చేంతవరకు, ఇది కేవలం మెషీన్ లోపం కాదు... ఇదొక తెలివైన దోపిడీ వ్యాపార విధానం!

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

మలబార్ గోల్డ్ పై FIR నమోదు: నమ్మకం పేరిట నిలువు దోపిడీ!

vertical exploitationFirregisteredMalabarGoldnametrust

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News