05/11/2026, Thursday · 08:58:43 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌.. మళ్లీ నంబర్‌ వన్‌గా అభిషేక్‌ శర్మ

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 4:24 PM జాతీయం 15

ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌.. మళ్లీ నంబర్‌ వన్‌గా అభిషేక్‌ శర్మ
Want this news as a newspaper clip?Print News Clip

స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత యువ ఓపెనర్, వెల్లింగ్టన్ వీరుడు అభిషేక్ శర్మ మళ్లీ ప్రపంచ నంబర్ 1 ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే 113 పరుగులతో అభిషేక్.. స్టేడియాన్ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ అద్భుతమైన ప్రదర్శన తర్వాత తాజాగా మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 897 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. పాకిస్థాన్ టీ20 కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్ 883 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.మరోవైపు టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ 866 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. గాయం కారణంగా కిషన్ ఒక్క మ్యాచ్‌నే ఆడి ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఈ ప్రభావంతో అతడి ర్యాంక్ మూడో స్థానానికి పడిపోయింది. అలాగే, భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయిదు స్థానాలు కోల్పోయి 758 పాయింట్లతో 9వ స్థానానికి పరిమితమయ్యాడు. టీమిండియ ఇతర ప్లేయర్లు కూడా ఈసారి ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాలను సాధించారు. భారత వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ ఆరు స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ హిట్టర్ ఫిన్ అలెన్ 25వ స్థానంలో నిలిచాడు.

ఇక బౌలింగ్ విభాగంలోనూ భారత్ తరఫున పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని 15వ స్థానాన్ని దక్కించుకున్నాడు. కివీస్ కెప్టెన్ మిచెల్ శాంటర్న్ 7వ స్థానానికి చేరుకున్నాడు. మొత్తంగా వెల్లింగ్టన్ వీరుడు అభిషేక్ శర్మ మరోసారి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలవడంపై క్రికెట్ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Rankings AbhishekSharmaICCT20Battingnumber

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News