05/11/2026, Thursday · 08:58:42 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

సర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. నిరంతరం దరఖాస్తులు స్వీకరించాలని స్పష్టం..

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 5:09 PM జాతీయం 21

సర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. నిరంతరం దరఖాస్తులు స్వీకరించాలని స్పష్టం..
Want this news as a newspaper clip?Print News Clip

ఢిల్లీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో పేర్ల చేర్పులు, వివరాల మార్పులకు సంబంధించిన దరఖాస్తులను నిరంతరం స్వీకరించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, కేవలం దరఖాస్తు పత్రం సమర్పించలేదనే కారణంతో ఓటర్ల పేర్ల తొలగింపు సరికాదని పేర్కొంది (Delhi SIR).ఫారం-6, ఫారం-8 దరఖాస్తులకు కఠిన గడువులు పెట్టొద్దని, ఎప్పుడైనా స్వీకరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహానగరాల్లో నివసించే వలస కార్మికులు, కూలీల జీవన విధానాన్ని అధికారులు దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఉపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి నిర్దిష్ట గడువుల్లో పత్రాలు సమర్పించడం కష్టమయ్యే అవకాశముందని, ఇలాంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేసింది (Supreme Court SIR order).

'లాజికల్ డిస్క్రిపెన్సీ' కేటగిరీ చట్టబద్ధతను భవిష్యత్తులో పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది (voter list revision). ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయనే కారణంతో తీసుకునే చర్యలు న్యాయపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని పేర్కొంది. ఓటు హక్కు ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ, అర్హులైన పౌరులు ఓటర్ల జాబితాలో చోటు పొందేందుకు తగిన అవకాశాలు కల్పించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

applications continuouslyclearSupremeCourtkeydirectionsSirprocess

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News