05/11/2026, Thursday · 09:02:34 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఆ విషయంలో కోహ్లీ మాట తప్పాడు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 3:02 PM జాతీయం 4

ఆ విషయంలో కోహ్లీ మాట తప్పాడు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
Want this news as a newspaper clip?Print News Clip

 భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు తాను గాయపడ్డానని.. ఫిట్‌గా తిరిగొస్తే జట్టులో చోటు కల్పిస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడని ఆరోపించాడు. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు అమిత్ మిశ్రా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమితుడైన సంగతి తెలిసిందే. తాజాగా ఆకాశ్ చోప్రా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో అమిత్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశాడు.‘2017లో ఇంగ్లండ్‌తో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో నా కాలికి గాయమైంది. అప్పుడు టీమిండియా కోచ్‌గా అనిల్ కుంబ్లే ఉన్నారు. నేను జట్టును వీడే సమయంలో ఆయనతో మాట్లాడాను. ఫిట్‌నెస్ సాధించి తిరిగి వస్తే జట్టులోకి తీసుకుంటామని, ఆందోళన పడొద్దని చెప్పారు. అదే సమయంలో విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యాడు. అతడిని కూడా జట్టులోకి తిరిగి రావడానికి ఏం చేయాలని అడిగాను. ‘ఫిట్‌గా ఉండు.. జట్టులో చోటు ఉంటుంది’ అని చెప్పాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత జట్టులోకి రీఎంట్రీ గురించి మళ్లీ కోహ్లీని సంప్రదించా. పది రోజుల్లో విషయం చెబుతానని హామీ ఇచ్చాడు. వారాలు గడిచినా ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఫోన్, మెసేజ్ చేశా.. సమాధానం రాలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

నాకంటే తీవ్రంగా గాయపడిన ఆటగాళ్లు, ఎక్కువ కాలం జట్టుకు దూరంగా ఉన్నవాళ్లు కూడా తిరిగి వచ్చారు. కానీ నా విషయంలో మాత్రం ఏం జరిగిందో అర్థం కాలేదు. చివరికి నేను కూడా ప్రయత్నించడం మానేశాను. ఒకరికి మీరు అవసరం లేదనుకున్నప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? ఇప్పటికీ నాకు ఎలాంటి సమాధానం రాలేదు’ అని అమిత్ మిశ్రా ఆరోపించాడు. కాగా అమిత్ మిశ్రాకు ఆ మ్యాచ్.. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో చివరిదిగా మిగిలిపోయింది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Amit MishraKohlimistakeregard

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News