మేడిగడ్డను సందర్శించిన మహారాష్ట్ర సీఎస్

మహదేవపూర్ రూరల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ సందర్శించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచా మండలంలోని పలు ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. పల్లె నిద్ర అనంతరం ఆయన ఆదివారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీతో పాటు మహారాష్ట్ర వైపు ఉన్న వడిదం పార్క్, తదితర సందర్శనీయ ప్రదేశాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. బ్యారేజీకి వచ్చిన సీఎ్‌సకు మేడిగడ్డ ఈఈ సురేష్ ప్రాజెక్టు గురించి వివరించారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












