05/11/2026, Thursday · 08:03:03 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

మహారాష్ట్రలో ఆహార కల్తీపై ఎఫ్‌డీఏ కొరడా.. 9 కోట్ల విలువైన సరుకు సీజ్

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 11:43 AM జాతీయం 8

మహారాష్ట్రలో ఆహార కల్తీపై ఎఫ్‌డీఏ కొరడా.. 9 కోట్ల విలువైన సరుకు సీజ్
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో ఆహార కల్తీపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కొరడా ఝళిపించింది. కల్తీకి పాల్పడుతున్న 19 వ్యాపార సంస్థల లైసెన్సులను ఎఫ్‌డీఏ సస్పెండ్ చేసింది. లైసెన్సులు రద్దయిన వ్యాపార సంస్థల్లో పతంజలి ఆయుర్వేద్ కూడా ఉంది. అంతేకాకుండా రూ.9 కోట్ల విలువైన సరుకును కూడా సీజ్ చేసింది. స్పెషల్ ఫెస్టివ్ సీజన్‌లో భాగంగా ఏడు డివిజన్లలోని 114 చోట్ల ఎఫ్‌డీఏ సోదాలు చేసింది. 3.53 లక్షల కిలోల విలువైన కల్తీ సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో పతంజలి ఆయుర్వేద్ డిస్ట్రిబ్యూటర్ అయిన ఎంఎస్ దివ్యా మహావితారక్ నుంచి 2,279.7 లీటర్ల నెయ్యిని సీజ్ చేశారు. ఆ సరుకు విలువ రూ.20.20 లక్షలు. ఛత్రపతి సంభాజీనగర్‌లో ఆ సరుకును సీజ్ చేశారు.ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2006 నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు ఆహార కల్తీకి పాల్పడిన 19 వ్యాపార సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేశామని అధికారులు తెలిపారు. ముంబై, అమరావతి, ఛత్రపతి శంభాజీనగర్‌లోని నమ్కీన్, స్వీట్‌మీట్, స్పైసీ తయారీ యూనిట్లలో సోదాలు చేశామని చెప్పారు. తయారీ యూనిట్లలో కంపెనీలు శుభ్రతను పాటించడం లేదని కనుగొనట్లు వెల్లడించారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార ఉత్పత్తి చేస్తున్నారని వివరించారు. అలాగే ఠాణె జిల్లా భివండిలోని అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్‌లో 1,44,218 కిలోల వంటనూనెను కూడా సీజ్ చేశామని పేర్కొన్నారు. సతారాలో అమిన్ ట్రేడర్స్ నుంచి 20,560 కిలోల బియ్యం, పప్పుధాన్యాలు, బెల్లంతో పాటు ఇతర ఆహార వస్తువులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

ephdie koradamaharashtraloaharakaltipaikotlaviluvainasaruku

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News