05/11/2026, Thursday · 09:02:23 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఎస్‌బీఐలో భారీగా డేటా లీక్‌

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 2:45 PM జాతీయం 6

ఎస్‌బీఐలో భారీగా డేటా లీక్‌
Want this news as a newspaper clip?Print News Clip
  • 3,897 మంది ఖతాదారుల 3.75 లక్షల ఫైల్స్‌ బహిర్గతం
  • సైబర్‌ సెక్యూరిటీ సంస్థకే షాక్‌..

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ)పై సైబర్‌ దాడి జరిగింది. 3,897 మంది ఖాతాదారుల వ్యక్తిగత, బ్యాంకింగ్‌ సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లు డార్క్‌వెబ్‌లో ఉంచారు.ఈ నెల 16వ తేదీనే ఈ డేటా లీక్‌కు సంబంధించి తమకు డిఫెన్స్‌ సైబర్‌ ఏజెన్సీ (డీసీఏ)తోపాటు కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌-ఇండియా (సెర్న్‌-ఇన్‌) నుంచి హెచ్చరికలు వచ్చాయని ఎస్బీఐ పేర్కొంది. ఈ సైబర్‌ దాడి వల్ల తమ బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు ఎలాంటి విఘాతం కలగలేదని వెల్లడించింది. అయితే, డేటా లీక్‌ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. లీక్‌ అని వారి ఖాతాల్లో ఉన్న డబ్బు ఎక్కడికీ పోదని భరోసా ఇచ్చింది. కానీ, ఆ ఖాతాదారులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ‘‘లీకైన డేటాను ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లు ఆయా ఖాతాదారులకు ఫోన్లు చేసి బ్యాంకు సిబ్బందిమని నమ్మించే ప్రయత్నం చేసే ప్రమాదం ఉంది. బ్యాంకు సిబ్బంది పేరుతో ఎవరైనా ఫోన్లు చేసి పిన్‌, ఓటీపీ, పాస్‌వర్డ్‌ లాంటివి అడిగే చెప్పొద్దు’’ అని కోరింది. ఇదిలా ఉండగా, దేశంలోని మరో పెద్ద బ్యాంకు అయిన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులోనూ సున్నితమైన డేటా లీక్‌ విషయం బయటకు వచ్చింది. ఈ బ్యాంకుకు చెందిన వ్యాపార వ్యూహాలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని ఆ సంస్థకే చెందిన ఇద్దరు సీనియర్‌ అధికారులే స్వయంగా లీక్‌ చేసినట్లు గుర్తించారు.

సైబర్‌ సెక్యూరిటీ సంస్థకే షాక్‌..

అంతర్జాతీయ స్థాయి సంస్థలకు డిజిటల్‌ సర్టిఫికేట్లు తయారుచేసి ఇచ్చే భారతీయ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఈ-ముద్రకు సైబర్‌ నిపుణులు షాకిచ్చారు. ఆ సంస్థ గతేడాది తయారు చేసిన 8డిజిటల్‌ సర్టిఫికేట్ల కీలు అత్యంత బలహీనంగా ఉన్నాయని ఒక నిపుణుడు గుర్తించి కేవలం ఒక్క సెకనులోనే వాటిని చేధించారు. ఈ కీలను ఉపయోగించి నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించవచ్చు. అప్పుడు వినియోగదారుడు అసలు వెబ్‌సైట్‌లోకి వెళ్లకుండా దారిమళ్లించగలరు. ఈ చర్యలను బ్రౌజర్లు ఏమాత్రం గుర్తించలేవు. ఈ ఘటన నేపథ్యంలో గూగుల్‌, యాపిల్‌, మొజిల్లా, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలు ఈ-ముద్ర డిజిటల్‌ సర్టిఫికేట్లను బ్లాక్‌ చేశాయి.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

breachin SBIMassivedata

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News