05/11/2026, Thursday · 09:02:41 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. మిడ్, స్మాల్ క్యాప్స్‌లో వరుసగా అమ్మకాలు..

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 11:29 AM జాతీయం 4

స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. మిడ్, స్మాల్ క్యాప్స్‌లో వరుసగా అమ్మకాలు..
Want this news as a newspaper clip?Print News Clip

 దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ గరిష్ఠ స్థాయి నుంచి సుమారు 1,000 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 22,500 పాయింట్ల దిగువకు చేరింది. ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ప్రతిరోజు అమ్మకాల ఒత్తిడి కనబడుతోంది. దీంతో మిడ్, స్మాల్ సూచీలు భారీగా పతనమవుతున్నాయి (Sensex today).మార్కెట్‌పై ఒత్తిడికి ప్రధాన కారణాల్లో ముడి చమురు ధరల పెరుగుదల ఒకటి. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 113 డాలర్లకు పైగా చేరడం ఆందోళన కలిగిస్తోంది. సౌదీ అరేబియాపై హౌతీ దాడుల నేపథ్యంలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగవచ్చన్న భయాలు పెరిగాయి. దీంతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిఫ్టీ 50 సూచీలో కొన్ని ప్రముఖ కంపెనీల షేర్లు పతనం సూచీలను వెనక్కి లాగుతోంది. ప్రధాన సూచీలతో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి మరింత స్పష్టంగా కనిపించింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 3 శాతానికి పైగా పడిపోగా, మిడ్‌క్యాప్ సూచీలు సుమారు 1.4 శాతం నష్టపోయాయి (stock market crash).

ఒకవైపు అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నా, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) గురువారం భారత స్టాక్ మార్కెట్లో నికరంగా రూ.1,022 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు (Crude oil prices). దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DII) కూడా రూ.1,614 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. అయినప్పటికీ శుక్రవారం మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, చమురు ధరలు, షేర్లలో అమ్మకాల ధోరణి మార్కెట్ దిశను ప్రభావితం చేస్తున్నాయి.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

successive salesMassivefallstockmarketmidcaps

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News