05/11/2026, Thursday · 09:02:41 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

అకౌంట్‌లోకి డబ్బులు.. రైతులకు తీపి కబురు

భవ్య జర్నలిస్ట్ 25/10/2026 11:35 AM జాతీయం 4

అకౌంట్‌లోకి డబ్బులు.. రైతులకు తీపి కబురు
Want this news as a newspaper clip?Print News Clip

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 24వ విడత సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం అందించింది. అక్టోబర్ 30న అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,000 జమ చేయనున్నట్లు పీఎం కిసాన్ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా తాజాగా ప్రకటించింది. ఈ-కేవైసీ, ఆధార్ అనుసంధానం, భూమి వివరాల ధ్రువీకరణ వంటి అంశాలు సక్రమంగా ఉన్నాయో లేదో ముందుగానే తనిఖీ చేసుకోవాలని సూచించింది.ఏడాదికి రూ.6,000 సాయం

కేంద్ర ప్రభుత్వం రైతు కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన భూమి కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 అందిస్తారు. ఈ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు.

చివరిగా 2026 జూన్ 20న ఈ పథకం 23వ విడతను విడుదల చేశారు. ఇప్పుడు 24వ విడతను అక్టోబర్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, రైతులందరికీ చెల్లింపులు సజావుగా అందాలంటే వారి రికార్డుల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవడం ముఖ్యం.

మీకు వస్తుందో లేదో ఇలా చూసుకోండి..

రైతులు తమకు 24వ విడత సాయం అందుతుందో లేదో తెలుసుకోవడానికి పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఇందుకోసం..

మొబైల్ లేదా కంప్యూటర్‌లో పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌ను తెరవండి.

‘Know Your Status’ ఎంపికను ఎంచుకోండి

రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, తెరపై కనిపించే ధ్రువీకరణ కోడ్‌ను పూర్తి చేయండి. అవసరమైతే నమోదిత మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో ధ్రువీకరించండి.

చెల్లింపు వివరాలను పరిశీలించండి

ఈ-కేవైసీ స్థితి, భూమి వివరాల ధ్రువీకరణ, బ్యాంకు ఖాతా సంబంధిత వివరాలు, చెల్లింపు స్థితిని పరిశీలించండి. ఏదైనా లోపం కనిపిస్తే దాన్ని సరిచేసుకోండి.

ఈ-కేవైసీ పూర్తి చేయడానికి మూడు మార్గాలు

పీఎం కిసాన్ పథకంలో ఈ-కేవైసీ తప్పనిసరి. రైతులు తమకు అనుకూలమైన పద్ధతిలో దీన్ని పూర్తి చేయవచ్చు.

ఓటీపీ ద్వారా: పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఈ-కేవైసీ ఎంపికను ఎంచుకుని ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో ప్రక్రియను పూర్తి చేయాలి.

వేలిముద్రల ద్వారా: సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌ (CSC) లేదా అందుబాటులో ఉన్న అధీకృత సేవా కేంద్రాన్ని సందర్శించి బయోమెట్రిక్ ధ్రువీకరణ చేయించుకోవచ్చు.

ఫేసియల్‌ రికగ్నిషన్‌ ద్వారా: పీఎం కిసాన్ మొబైల్ యాప్, ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్‌లను అధికారికంగా డౌన్‌లోడ్ చేసుకుని, వాటిలోని సూచనల ప్రకారం ఫేసియల్‌ రికగ్నిషన్‌ ధ్రువీకరణ పూర్తి చేయవచ్చు.

ఇవి చెక్‌ చేసుకోండి

ఈ-కేవైసీ పూర్తయినప్పటికీ ఇతర వివరాల్లో లోపాలుంటే చెల్లింపు నిలిచిపోయే అవకాశం ఉంది. అందువల్ల రైతులు ఈ అంశాలపై దృష్టి పెట్టాలి.

బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం, ఆధార్ ఆధారిత చెల్లింపులకు అవసరమైన బ్యాంకు సీడింగ్ సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి.

భూమి రికార్డులు, రైతు నమోదు వివరాల్లో తప్పులు ఉన్నాయేమో తనిఖీ చేయాలి.

ఒకే కుటుంబంలో అనర్హంగా ఒకరి కంటే ఎక్కువ మంది ప్రయోజనం పొందుతున్నట్లు అనుమానాలున్న కేసుల్లో భౌతిక ధ్రువీకరణ పూర్తయ్యే వరకు సాయం నిలిపివేసే అవకాశం ఉంది.

ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, పథకం నిబంధనల ప్రకారం అనర్హులైన కొన్ని వర్గాలకు ఈ సాయం వర్తించదు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Sweet KabiruMoneyaccountfarmers

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News