మురసు తుఫాన్.. ఏపీ ప్రజలకు అండగా కేంద్రం: అమిత్ షా హామీ

న్యూఢిల్లీ : మురసు తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఫోన్‌లో మాట్లాడి.. మురసు తుఫాన్ ప్రభావం వివరాలను తెలుసుకున్నానని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయనకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే ఎన్‌డీఆర్ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్ఎఫ్ (SDRF), బృందాలు క్షేత్రస్థాయిలో సహాయ చర్యలు చేపట్టి.. తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలకు అండగా నిలుస్తున్నాయని అమిత్ షా వివరించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా ద్వారా అమిత్ షా వెల్లడించారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












